Small savings schemes: ఈ త్రైమాసికంలో వడ్డీరేట్ల పరిస్థితి ఏంటి..? ఆర్థిక నిపుణుల అంచనాలు ఇవే..!
పొదుపు అనేది మన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. బంగారు భవిష్యత్తుకు మొదటి అడుగుగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్రజల్లో ఈ అలవాటును ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ పొదుపు పథకాలను అమలు చేస్తోంది. వాటిలో డబ్బులను దాచుకోవడం ద్వారా కొంతకాలానికి నిర్ణీత మొత్తం అందుకుంటారు. ఈ పొదుపు పథకాలను వివిధ వడ్డీరేట్లు అమలవుతాయి. ప్రతి త్రైమాసికంలో వీటిపై సమీక్ష జరుగుతుంది.
పొదుపు అనేది మన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. బంగారు భవిష్యత్తుకు మొదటి అడుగుగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్రజల్లో ఈ అలవాటును ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ పొదుపు పథకాలను అమలు చేస్తోంది. వాటిలో డబ్బులను దాచుకోవడం ద్వారా కొంతకాలానికి నిర్ణీత మొత్తం అందుకుంటారు. ఈ పొదుపు పథకాలను వివిధ వడ్డీరేట్లు అమలవుతాయి. ప్రతి త్రైమాసికంలో వీటిపై సమీక్ష జరుగుతుంది. వాటిని పెంచాలో, తగ్గించాలో నిర్ణయం తీసుకుంటారు. ఈ త్రైమాసికానికి (అక్టోబర్ నుంచి డిసెంబర్) వడ్డీరేట్ల అమలుపై సెప్టెంబర్ 30న నిర్ణయం తీసుకోనున్నారు. పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
చిన్న పొదుపు పథకాలంటే..
ప్రజలు చిన్న మొత్తాలను పొదుపు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వీటిని అమలు చేస్తుంది. వీటిలో పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రత పథకాలు, నెలవారీ ఆదాయ ప్రణాళిక అనే మూడు విభాగాలుగా ఉంటాయి. పొదుపు డిపాజిట్లకు సంబంధించి ఏడాది నుంచి మూడేళ్ల టైమ్ డిపాజిట్లు, ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. అలానే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) తదితర వాటిని అమలు చేస్తున్నారు. ఇక సామాజిక భద్రత పథకాల విభాగంలోకి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీములు వస్తాయి. మూడోదైన నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ ఆదాయ ఖాతా ఉంటుంది. పీపీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్ సీ, ఎస్ఎస్వై వంటి వాటిపై వివిధ రకాల వడ్డీరేట్లు అమలు చేస్తుంటారు. వాటిని ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. దానికి అనుగుణంగా తర్వాత మూడు నెలలు వడ్డీ రేట్లు అమలవుతాయి.
ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేట్లు
గత త్రైమాసికంలో (జూలై నుంచి సెప్టెంబర్ వరకూ) అమలవుతున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. వీటినే ఈసారి కూడా కొనసాగించనున్నారు.
- సేవింగ్ డిపాజిట్లపై నాలుగు శాతం
- ఏడాది పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం
- రెండేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 7 శాతం
- మూడేళ్లలో పు వాటిపై 7.1 శాతం
- ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం
- ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 6.7 శాతం
- నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ల(ఎన్ఎస్ సీ)పై 7.7 శాతం
- కిసాన్ వికాస్ పత్రాలపై 7.5 శాతం
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం
- సుకన్య యోజనపై 8.2 శాతం
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్పై 8.2 శాతం
- నెలవారీ ఆదాయ ఖాతాలపై 7.4 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి