AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి? రూ. 50,000 మినహాయింపును ఎవరు క్లయిమ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు..

ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ కంపెనీ లేదా మరేదైనా యజమాని నుండి జీతం లేదా పెన్షన్ పొందే వ్యక్తులు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. 2023-23 ఆర్థిక సంవత్సరం నుండి, ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో కూడా అందుబాటులో ఉంటుంది.

Income Tax: స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి? రూ. 50,000 మినహాయింపును ఎవరు క్లయిమ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు..
Tax
Madhu
|

Updated on: Apr 03, 2023 | 4:30 PM

Share

స్టాండర్డ్ డిడక్షన్.. పన్ను చెల్లించే ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కేవలం పాత ట్యాక్స్ విధానంలోనే అందుబాటులో ఉండేది. అయితే ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. వేతన జీవులు, పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షనర్లు ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి? ఎవరు దానికి అర్హులు? ఎప్పటి నుంచి అది అందుబాటులో ఉంది. ఎలా క్లయిమ్ చేసుకోవాలి వంటి వివరాలను ఇప్పుుడు తెలుసుకుందాం..

స్టాండర్డ్ డిడక్షన్ అంటే..

ఆదాయ పన్ను చట్టు 1961, సెక్షన్16 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ అంటే పన్ను చెల్లింపు దారులకు అందించే ఫ్లాట్ తగ్గింపు. ఇది వ్యక్తి మొత్తం ఆదాయంతో సంబంధం లేకుండా మినహాయిపు ఇచ్చే స్థిర మొత్తం. ప్రస్తుతం దీనిని రూ. 50,000లకు నిర్దేశించారు. భారతదేశంలో, స్టాండర్డ్ డిడక్షన్ 1974లో ప్రవేశపెట్టారు. అయితే తరువాత నిలిపివేయబడింది. యూనియన్ బడ్జెట్ 2018 దీనిని తిరిగి ప్రవేశపెట్టారు. మరియు ప్రస్తుతం ఇది జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్‌లకు ఇది అందుబాటులో ఉంది.

ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?

ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ కంపెనీ లేదా మరేదైనా యజమాని నుండి జీతం లేదా పెన్షన్ పొందే వ్యక్తులు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు స్టాండర్డ్ డిడక్షన్‌ని క్లెయిమ్ చేశారని గమనించాలి. అయితే, 2023-23 ఆర్థిక సంవత్సరం నుండి, ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రయోజనం ఇది..

ఈ మినహాయింపు వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వారి పన్ను భారం తగ్గుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) నుండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తులకు కూడా ప్రయోజనాలు వర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి