Smartwatches Under 3k: ఈ వాచ్‌లు చాలా స్మార్ట్ గురూ.. వాచ్ పెట్టుకొని స్విమ్మింగ్ కూడా చేయొచ్చు.. ధర మీ బడ్జెట్‌లోనే..

అనువైన బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ వాచ్ లను మేం లిస్ట్ అవుట్ చేశాం. 2023లో కేవలం రూ. 3000లోపు బడ్జెట్ అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ వాచ్ లలో కెల్లా బెస్ట్ డిజైన్, పనితీరును కలిగి ఉన్నాయి.

Smartwatches Under 3k: ఈ వాచ్‌లు చాలా స్మార్ట్ గురూ.. వాచ్ పెట్టుకొని స్విమ్మింగ్ కూడా చేయొచ్చు.. ధర మీ బడ్జెట్‌లోనే..
Boat Storm Smartwatch
Follow us
Madhu

|

Updated on: Apr 03, 2023 | 4:00 PM

వాచ్ అంటే ఇది వరకూ కేవలం టైం చూసుకోడానికి మాత్రమే ఉపయోగపడే సాధనం. అయితే కాలం మారింది. అన్నీ అప్ గ్రేడ్ అవుతున్నాయి. రిస్ట్ వాచ్ లు కూడా స్మార్ట్ వాచ్ లుగా రూపాంతరం చెందాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాక.. అంతకుమించిన అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. హెల్త్ ట్రాకర్, ఫిట్ నెస్ ట్రాకర్, బ్లూటూత్ కనెక్టవిటీ, మ్యూజిక్ వంటి ఫీచర్లు ఒక్క స్మార్ట్ వాచ్లోనే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ ఫీచర్లు ఉన్నా.. మనకు అనువైన ధరలో ఉంటేనే వాటిని కొనుగోలు చేయగలం. అందుకునే అనువైన బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ వాచ్ లను మేం లిస్ట్ అవుట్ చేశాం. 2023లో కేవలం రూ. 3000లోపు బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ వాచ్ లలో కెల్లా బెస్ట్ డిజైన్, మంచి పనితీరును కలిగి ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి..

బోట్ స్టార్మ్ @ రూ. 1,199

బోట్ స్టార్మ్ వాచ్ స్టైలిష్ లుక్ లో ఉంటుంది. 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వృత్తాకార 1.3-అంగుళాల డిస్‌ప్లేతో ఇది వస్తుంది. దీనిలో హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తొమ్మిది రకాల స్పోర్ట్స్ మోడ్‌ లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. ఈత లేదా నీటి క్రీడలకు ఇది సరైనది. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తూనే ఉంటుంది.

నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా @ రూ. 1,999

సరసమైన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్న వారికి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా మరొక ఎంపిక. ఇది 1.75-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 60 రకాల స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి. దీనిలోని బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే తొమ్మిది రోజుల పాటు పనిచేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

అమాజ్‌ఫిట్ నియో @ రూ. 2,499

అమాజ్‌ఫిట్ నియో అనేది రెట్రో డిజైన్, ఆధునిక ఫీచర్లతో వచ్చే స్టైలిష్ స్మార్ట్‌వాచ్. దీనిలో 1.2-అంగుళాలతో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేను ఉంటుంది. ఇది మీకు సమయం, తేదీ, దశల సంఖ్య, బర్న్ అియన కేలరీలను చూపుతుంది. మీ హృదయ స్పందన రేటు, నిద్ర నాణ్యతను పర్యవేక్షించడానికి వాచ్‌లో పీపీజీ బయో-ట్రాకింగ్ సెన్సార్‌ను అమర్చారు. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 28 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది కూడా వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. స్విమ్మింగ్ కు బెస్ట్ ఎంపిక..

ఫైర్ బోల్ట్ SpO2 @ రూ. 2,499

Fire-Boltt SpO2 అనేది బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్‌లతో వచ్చే మరో గొప్ప స్మార్ట్‌వాచ్. దీనిలో 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.4-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. దీనిలోని బ్యాటరీ 10 రోజుల పాటు వస్తుంది. వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగాతో సహా తొమ్మిది స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..