Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Update: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక టెక్ట్స్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవి..

వాట్సాప్ బీటా ఇన్ ఫో రిపోర్టు ప్రకారం టెక్ట్స్ ఎడిటర్ లోని ఫాంట్ చేంజ్ ఆప్షన్ తో యూజర్ కీబోర్డులో తనకు నచ్చిన ఫాంట్ ను ఎంచుకుని టెక్ట్స్ లో మార్పులు చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్ లపై టెక్ట్స్ రాసేటప్పుడు ఈ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

WhatsApp New Update: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక టెక్ట్స్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవి..
Whatsapp Messages
Follow us
Madhu

|

Updated on: Apr 03, 2023 | 3:30 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే వాయిస్ నోట్, తేదీతో చాట్ సెర్చ్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందించింది. ఇప్పుడు మరింత అడ్వాన్స్ డ్ ఫీచర్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన పరీక్షలు కూడా వేగంగా నిర్వహిస్తోంది. త్వరలో టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. దీనిలో ఫొటోలు, వీడియోలు, గిఫ్ లను ఎడిట్ చేయడానికి వీలుంటుంది. ఈటెక్ట్స్ ఎడిటర్ మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటితో యూజర్లు టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్, ఫాంట్ చేంజ్, టెక్ట్స్ అలైన్మెంట్ వంటివి చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్ బీటా ఇన్ ఫో రిపోర్టు ప్రకారం.. టెక్ట్స్ ఎడిటర్ లోని ఫాంట్ చేంజ్ ఆప్షన్ తో, యూజర్ కీబోర్డులో తనకు నచ్చిన ఫాంట్ ను ఎంచుకుని టెక్ట్స్ లో మార్పులు చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్ లపై టెక్ట్స్ రాసేటప్పుడు ఈ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

  • టెక్ట్స్ అలైన్మెంట్ ఫీచర్ తో యూజర్ తనకు నచ్చిన వైపు దాన్ని మార్చుకోవచ్చు. అంటే కుడి, ఎడమ, సెంటర్ వైపులకు పెట్టుకోవచ్చు.
  • టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో మొత్తం టెక్ట్స్ లో మీకు హైలెట్ అవ్వాలనుకునే ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేకంగా కనిపించేలా మార్పులు చేయొచ్చు. అలాగే నచ్చిన రంగు లేదా ఫొటోను టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు.
  • అలాగే కొన్ని కొత్త ఫాంట్లను కూడా వాట్సాప్ ఈ అప్ డేట్ లో ఇవ్వనుంది. కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్ ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ వంటి ఫాంట్లు బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

మరిన్ని ఫీచర్లు త్వరలో..

అలాగే మార్చిలో ప్రచురితమైన కొన్ని రిపోర్టుల ప్రకారం వాట్సాప్ ఆడియో చాట్స్ అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అలాగే యూజర్లు వాట్సాప్ పంపే ఫొటోలను ఒరిజనల్ సైజ్ లో పంపేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ వాట్సాప్ ద్వారా ఫొటోను ఇతరులకు షేర్ చేసినప్పుడు వాటి క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?