- Telugu News Photo Gallery Science photos Massive 'Hole' Spotted on Sun's Surface. Know What It Means and possible effects
Hole Spotted on Sun’s Surface: సూర్యునిపై భూమి కంటే పెద్ద రంధ్రం.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే..
సూర్యుని ఉపరితలంపై రంధ్రం కనిపించినట్లుగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు సూర్యునిపై పెద్ద ముదురు రంగు ప్రాంతాన్ని చూశారు. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదిగా ఉన్నట్లగా గుర్తించారు.
Updated on: Apr 02, 2023 | 9:12 PM

వైస్ న్యూస్ అందించిన సమాచారం ప్రకారం, నాసా శాస్త్రవేత్తలు దీనిని కరోనల్ హోల్ అని పిలుస్తున్నారు. అలాగే, దానిని చూస్తుంటే సూర్యునిలో కొంత భాగం అదృశ్యమైనట్లు అనిపిస్తోందని ఆయన తెలిపారు.

సూర్యుని దక్షిణ ధ్రువానికి సమీపంలో మార్చి 23న నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) కరోనల్ హోల్‌ను కనుగొంది.

నాసా గొడ్దార్డ్ యొక్క హీలియో ఫిజిక్స్ సైన్స్ విభాగానికి చెందిన అలెక్స్ యంగ్ ప్రస్తుత కరోనల్ రంధ్రం చాలా పెద్దదని తెలిపారు.

ఈ రంధ్రం భూమి కంటే దాదాపు 20-30 రెట్లు పెద్దదని వారు తెలిపారు. అలాగే దీని వెడల్పు 300,000 నుంచి 400,000 కి.మీ ఉంటుందన్నారు.

ఇది భూమధ్యరేఖ వద్ద ఉండటం అంటే, అది సెంట్రల్ మెరిడియన్‌ను దాటి తిరిగే కొన్ని రోజుల తర్వాత భూమిపై వేగంగా గాలి వీస్తాయని అంచనా వేస్తున్నారు.

NASA అందించిన సమాచారం ప్రకారం, కరోనల్ రంధ్రం అతినీలలోహిత, మృదువైన X- కిరణాలలో సౌర కరోనాపై చీకటి ప్రాంతంగా కనిపిస్తుంది. సూర్యుని క్రోమోస్పియర్ ఎగువ భాగాన్ని కరోనా అంటారు.

అంతే కాకుండా భూమిపై ఈ సౌర పవనాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు పర్యవేక్షణ జరుగుతోంది. ఇది కాకుండా, ఇది భూమిపై మొబైల్ ఫోన్లు, GPS ను ప్రభావితం చేస్తుంది.




