AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..

తత్కాల్ టికెట్లతో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. అత్యవసర ప్రయాణాల కోసం ఈ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ప్రీమియం తత్కాల్ టికెట్లను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. చాలామందికి దీని గురించి తెలియదు. ఎందుకంటే ఎంపిక చేసిన కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Indian Railways: చివరి నిమిషంలో ట్రైన్‌లో టికెట్ కావాలా..? ఈ ఒక్క ఆప్షన్‌ తెలిస్తే టికెట్ మీ సొంతం కావాల్సిందే..
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Jun 03, 2026 | 4:16 PM

Share

రైళ్లల్లో ఎక్కువగా ప్రయాణం చేసేవారికి తత్కాల్ టికెట్ల గురించి తెలిసే ఉంటుంది. అత్యవసరంగా ఎక్కడికైనా ట్రైన్లలో ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లు ట్రైన్ బయల్దేరే ముందు రోజు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు అన్ని రైళ్లల్లో తత్కాల్ టికెట్లను ముందు రోజు విడుదల చేస్తారు. ఐఆర్‌సీటీసీ, రైల్ వన్, ఆర్‌సీటీసీ ఏజెంట్లు లేదా ఇతర యాప్స్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో విడుదల చేసిన కాసేపటికే అయిపోతాయి. తత్కాల్‌తో పాటు ప్రీమియం తత్కాల్ టికెట్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా..? అసలు ప్రీమియం తత్కాల్ ఏంటి? ఏయే ట్రైన్లలో అందుబాటులో ఉంటాయి? అనే విషయాలు చూద్దాం.

ప్రీమియం తత్కాల్ అంటే ఏంటి..?

అత్యవసర ప్రయాణం చేసేవారి కోసం రైల్వేశాఖ తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. సాధారణ టికెట్లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాసులకు ఉదయం 11 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు. ఇక ప్రీమియం తత్కాల్ టికెట్ల విషయానికొస్తే.. వీటిని తత్కాల్ టికెట్లకు అధునాతన రూపంగా వీటిని చెప్పవచ్చు. చివరి నిమిషంలో టికెట్ అవసరమై ఎక్కువ ధర చెల్లించేందుకు సిద్దమయ్యే ప్రయాణికుల కోసం ఈ కేటగిరీని ప్రవేశపెట్టారు. డిమాండ్‌ను బట్టి ప్రీమియం తత్కాల్ టికెట్ల ధరలు అనేవి ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటాయి. అంటే సీట్లు నిండే కొద్ది ధరలు పెరుగుతూ ఉంటాయి. అందుకే ఈ కేటగిరీ టికెట్లు సాధారణ తత్కాల్ టికెట్లతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటాయి.

ఏయే ట్రైన్లలో ఉంటాయంటే..?

తత్కాల్ టికెట్లు చాలా రైళ్లల్లో అందుబాటులో ఉంటాయి. కానీ ప్రీమియం తత్కాల్ టికెట్లు అనేవి ఎంపిక చేసిన కొన్ని రైళ్లల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏసీ క్లాసుల్లో టికెట్లను మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టికెట్లు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయి. తత్కాల్ కోటా కింద టిక్కెట్లు దొరకనివారు ప్రీమియం తత్కాల్ కింద టికెట్లను పొందవచ్చు. ఈ కోటా కింద టికెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ డిమాండ్, సీట్ల లభ్యతపై ఇది ఆధారపడి ఉంటుంది.

Follow Us