Gold Rate: సామాన్యులకు అదిరిపోయే శుభవార్త.. తులం బంగారం ధర రూ.36 వేలు!
Gold Rate: బంగారు ఆభరణాలను తయారు చేయడానికి 18క్యారట్ల బంగారం కూడా ఉపయోగిస్తారు. ఇందులో 75% మేలిమి బంగారం, మరో 25% మిగతా లోహాలు ఉంటాయి. దీని ధర కూడా 10 గ్రాములకు గానూ సుమారు 75 వేల రూపాయల వరకు..

Gold Rate: ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాములకు గాను 1.05 లక్షల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో అభరణాలు చేసుకునే బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 96 వేల రూపాయలకుపైనే ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు భారంగా మారింది. బంగారు ఆభరణాలు ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ముఖ్యంగా సగటు భారతీయులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: LPG Gas Price: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర
నిజానికి 22 క్యారెట్ల బంగారంతో బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. ఇందులో 91.6% వరకు బంగారం ఉంటుంది. దీనినే 916 కేడియం బంగారం అని కూడా పిలుస్తారు. ఇందులో కొద్దిగా ఇతర లోహాలను కూడా మిక్స్ చేస్తారు. ముఖ్యంగా మేలిమి బంగారంతో బంగారు ఆభరణాలు తయారు చేయడం కుదరదు. ఎందుకంటే బంగారం స్వభావం కాస్త మెత్తగా ఉంటుంది. వాటిపై డిజైన్లు నగిషీలు చెప్పాలంటే కాస్త దృఢత్వం అవసరం ఉంటుంది. అందుకే అందులో రాగి సహా ఇతర లోహాలు కలుపుతారు.
Cash Limit: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?
ఇక బంగారు ఆభరణాలను తయారు చేయడానికి 18క్యారట్ల బంగారం కూడా ఉపయోగిస్తారు. ఇందులో 75% మేలిమి బంగారం, మరో 25% మిగతా లోహాలు ఉంటాయి. దీని ధర కూడా 10 గ్రాములకు గానూ సుమారు 75 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇందులో బంగారం శాతం తగ్గిన నేపథ్యంలో ఇది కాస్త గట్టిగా ఉంటుంది. బంగారు విగ్రహాలను, వాచీలను ఇతర బరువైన ఆభరణాలను తయారు చేయడానికి ఈ 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇక 14 క్యారెట్ల బంగారం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిని దీని ధర తక్కువగా ఉన్నప్పటికీ దీనిని జ్యువెలరీ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో 58.3% బంగారం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Smartphone: ఈ ఆరు యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.. ఉపయోగం ఏంటో తెలుసా?
9 క్యారెట్ బంగారం అంటే ఏమిటి?
అయితే ఇటీవల 9 క్యారెట్ల బంగారం కూడా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో మేలిమి బంగారం 37.5% మాత్రమే ఉంటుంది. మిగతా 62.5% ఇతర లోహాలు కలిపి ఉంటుంది. ఇప్పుడు ఈ నగలకు BIS Hallmarking ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. వీటిని ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీని ధర 10 గ్రాములకు గాను రూ. 36, 660 వరకు ఉంటుంది. ఈ ధరలు ప్రాంతాలను బట్టి కాస్తా ఎక్కువ తక్కువ ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: అందరి మనస్సు దోచిన BSNL ప్లాన్.. రోజుకు రూ.5తో 450+లైవ్ ఛానెళ్లు, 25 OTTలు
ప్రభుత్వం ఇటీవల 9 క్యారెట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను నోటిఫై చేసిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్యను ఆభరణాల పరిశ్రమ స్వాగతించింది. ఇప్పటివరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 24K, 23K, 22K, 20K, 18K, 14K బంగారానికి హాల్‌మార్కింగ్ నిబంధనలను కలిగి ఉంది.
కొత్త 9K హాల్‌మార్కింగ్ ప్రమాణం తేలికైన బంగారు ఆభరణాలకు డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా అధిక బంగారం ధరలు చాలా మంది వినియోగదారులను సాంప్రదాయ కొనుగోళ్లకు దూరంగా నెట్టాయి. జూన్‌లో బంగారం అమ్మకాలు 60% తగ్గాయి. ఇది కోవిడ్-19 మహమ్మారి తర్వాత అత్యంత తీవ్రమైన పతనాన్ని సూచిస్తుంది.
ధర వ్యత్యాసం: 9K vs 24K బంగారం
ప్రస్తుతం 9K బంగారం ధర 10 గ్రాములకు దాదాపు ₨36,660గా ఉంది. ఇది 24K బంగారం 10 గ్రాములకు రూ.లక్షా 5 వేల వరకు ఉంది. 9K బంగారానికి హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టడం పండుగ, వివాహ సీజన్‌లలో మంచి డిమాండ్ ఏర్పడవచ్చు. ఇది బంగారం అమ్మకాలకు కీలకమైన సమయం. ఇప్పుడు దసరా నుండి దీపావళి వరకు, నవంబర్‌లో ప్రారంభమయ్యే శీతాకాలపు వివాహ సీజన్ వరకు డిమాండ్ సాధారణంగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Viral Video: రెస్టారెంట్‌కు వచ్చిన వీధి కుక్క.. చివరకు ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








