Car Sales: రూ. 5 లక్షలకే కొనేయొచ్చు.! త్వరపడండి.. సామాన్యుల కోసం లో-బడ్జెట్ కార్లు
వినాయక చవితి అయిపొయింది.! దసరా లేదా దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ల ఆప్షన్లు తీసుకొచ్చేశాం. కేవలం రూ. 5 లక్షలకే ఫ్రెండ్లీ బడ్జెట్ కార్లను కొనేయొచ్చు. మరి ఆ ఆప్షన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కారు కొనడం ఓ కల. అయితే కొందరికి ఈ కల కలగానే మిగిలిపోతోంది. ఆదాయం పెరుగుతున్నప్పటికీ.. ఖర్చులు కూడా పెరిగిపోవడంతో.. కార్లు కన్నా టూ-వీలర్ వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. అయితే మధ్యతరగతివారి కోసం లో-బడ్జెట్ కార్లు తీసుకొచ్చేశాం. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆ ఆప్షన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. కేవలం రూ. 5 లక్షల బడ్జెట్ తో మీరు ఈ కార్లు కొనేయొచ్చు. మరి అవేంటంటే.?
మారుతి సుజుకి ఆల్టో K10
ఆల్టో చాలా సంవత్సరాలుగా సామాన్యులకు అందుబాటులో ఉన్న కారు. ప్రస్తుతం మార్కెట్లో మారుతి ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షలు. మారుతి ఆల్టో K10 998 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో ఉంది. ఇది లీటర్ కు 24.9 కిమీ సామర్థ్యం ఇస్తుంది. మారుతి సుజుకి త్వరలో తన కొత్త ఆల్టో కారును కస్టమర్లకు విడుదల చేయనుంది.భారతదేశంలో అత్యంత మైలేజ్-సమర్థవంతమైన కారుగా ఉన్న ఈ ఆల్టో.. 1 లీటరు పెట్రోల్‌పై 30 కిమీ లేదా అంతకంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని అంచనా.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో రెండవ చౌకైన కారు. రూ. 5 లక్షల లోపు కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఎస్-ప్రెస్సో ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 998 సిసి ఇంజిన్‌తో శక్తినిస్తుంది. లీటర్ కు 25.3 కిమీ మైలేజీని అందిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
భారత మార్కెట్లో రెనాల్ట్ ఇండియా అతి తక్కువ ధరకు రెనాల్ట్ క్విడ్ అందిస్తోంది. సరసమైన కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. క్విడ్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ 999 సిసి ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది లీటర్‌కు 22.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.




