Okinawa vs Bajaj Chetak EV: ఈ రెండు ఈవీ స్కూటర్ల మధ్య ప్రధాన తేడాలివే.. ధర ఒకటే కానీ ఇన్ని మార్పులా?
ఈవీ వాహనాల్లో ఈవీ స్కూటర్లు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈవీ వాహనాల మార్కెట్‌లో మొదటి నుంచి ఒకినావా స్కూటర్లు తమదైన మార్క్‌ను చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకినావా ఒకి-90 స్కూటర్ ఎక్కువగా ఇష్టపడుతుననారు. అయితే అనంతరం బజాజ్ చేతక్ ఈవీ కూడా సేల్స్‌లో దుమ్ము రేపుతుంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈవీ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది. ముఖ్యంగా అన్ని కంపెనీలు వాహనదారులకు అందుబాటు ధరల్లో ఈవీ వాహనాలను తీసుకువస్తున్నాయి. అయితే ఈ ఈవీ వాహనాల్లో ఈవీ స్కూటర్లు ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈవీ వాహనాల మార్కెట్‌లో మొదటి నుంచి ఒకినావా స్కూటర్లు తమదైన మార్క్‌ను చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకినావా ఒకి-90 స్కూటర్ ఎక్కువగా ఇష్టపడుతుననారు. అయితే అనంతరం బజాజ్ చేతక్ ఈవీ కూడా సేల్స్‌లో దుమ్ము రేపుతుంది. ఈ రెండు స్కూటర్లు ఒకే ఫీచర్లు, ఆప్షన్‌లను ఇస్తుంది. అయినప్పటికీ, వాటి ధరల్లో మాత్రం స్వల్ప తేడాలు గమనించవచ్చు. ఈ స్కూటర్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ప్రధాన తేడాలు ఇవే
బజాజ్ చేతక్ భారతదేశంలో బజాజ్ కంపెనీ ప్రస్తుత రోజుల్లో తయారు చేసిన ప్రసిద్ధ స్కూటర్. ఈ స్కూటర్ మంచి మైలేజీని ఇస్తుంది. అధిక మైలేజ్ ఇవ్వడంతో భారతీయులు ఈ స్కూటర్‌కను అమితంగా ఇష్టపడుతున్నారు. ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 90 కిలో మీటర్ల మైలేజీని ఇవ్వడమే కాకుండా అనేక కీలకమైన ఫీచర్లను కలిగి ఉంది. 4200 వాట్స్ మోటారు వచ్చే ఈ స్కూటర్‌ను పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు ఒకినావా ఓకి 90 బలమైన పనితీరుకు ప్రశంసలు అందుకుంది. ఈ స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పోర్టబుల్ బ్యాటరీ ఫీచర్‌లను అందిస్తుంది. అయితే ఒకి 90 స్కూటర్ పూర్తిగా చార్జ్ కావడానికి 5-6 గంటల సమయం పడుతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 80-90 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఈ రెండు స్కూటర్లల్లో ఎకో, స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అలాగే బీఎల్‌డీసీ మోటర్లు, పోర్టబుల్ చార్జర్ వంటి సదుపాయాలు ఈ రెండు స్కూటర్లలో ఒకేలా ఉన్నాయి. అయితే బజాజ్ చేతక్‌కు సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తే ఒకి-90 స్కూటర్ మాత్రం ఈ-ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. చేతక్ స్కూటర్ వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌తో వస్తే ఒకి-90 మాత్రం డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.
ధర వ్యత్యాసం ఇదే
అధికారిక సమాచారం ప్రకారం బజాజ్ చేతక్ బైక్ ప్రారంభ ధర 1.20 లక్షలుగా ఉంది. ఇది కాకుండా ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపులలో ఈ స్కూటర్ సులభంగా లభిస్తుంది. అయితే ఈ స్కూటర్‌పై తగ్గింపు డీల్‌లను పొందడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఒకినావా ఒకి -90 ధర సుమారు రూ.1,72,584 ఉంది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య అనువైన స్కూటర్‌ను సెలెక్ట్ చేసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..