AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Volvo Electric SUV: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 650 కిలోమీటర్లు.. వోల్వో నుంచి అదిరిపోయే లగ్జరీ కారు..

ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ వోల్వో కూడా హై ఫీచర్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వోల్వో ఈఎక్స్90 ఎక్స్‌లెన్స్ పేరుతో ఆటో షాంగై లో ప్రదర్శించింది. 2022 నవంబర్ లో ఈఎక్స్90 పేరుతో ఓ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. ఇప్పడు దానికన్నా అడ్వాన్స్ డ్ ఫీచర్లతో ఎస్యూవీని పరిచయం చేసింది.

Volvo Electric SUV: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 650 కిలోమీటర్లు.. వోల్వో నుంచి అదిరిపోయే లగ్జరీ కారు..
Volvo Ex90 Excellence
Madhu
|

Updated on: Apr 24, 2023 | 4:15 PM

Share

ఆటో మొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాల హవా కొనసాగుతోంది. తక్కువ శ్రేణి కార్లు దగ్గర నుంచి హై ఎండ్, లగ్జరీ కార్ల వరకూ అంతా ఎలక్ట్రిక్ వేరియంట్లో మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ వోల్వో కూడా హై ఫీచర్డ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. వోల్వో ఈఎక్స్90 ఎక్స్‌లెన్స్ పేరుతో ఆటో షాంగై లో ప్రదర్శించింది. 2022 నవంబర్ లో ఈఎక్స్90 పేరుతో ఓ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. ఇప్పడు దానికన్నా అడ్వాన్స్ డ్ ఫీచర్లతో ఈ ఈఎక్స్90 ఎక్స్ లెన్స్ పేరుతో ఎస్యూవీని పరిచయం చేసింది. నాలుగు సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ ఎస్యూవీ తొలుత చైనా మాత్రమే ఈ కార్లను అమ్మకానికి ఉంచింది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు సంబంధించిన ఫీచర్లు, స్పసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్ అండ్ డిజైన్.. వోల్వో ఈఎక్స్​90 ఎక్సలెన్స్​.. స్టాండర్డ్​ ఈఎక్స్​90ని పోలి ఉంది. అయితే డ్యూయెల్​ టోన్​ పెయింట్​ థీమ్​, 22 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ కొత్తగా వస్తున్నాయి. అలాగే క్యాబిన్ లో కూడా స్టాండర్డ్ వెర్షన్ నుంచి చాలా మార్పులు చేసింది. ఈ మోడల్​ క్యాబిన్​ చాలా అపీలింగ్​ లుక్​తో ఉంటుంది. డాష్​బోర్డ్​ సింపుల్​గా కనిపిస్తుంది. భారీ ఇన్​ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ వర్టికల్​గా ఉంటుంది. ఈ ఎస్​యూవీ సెకెండ్​- రోలో 2 సీట్స్​ ఉంటాయి. స్పేషియస్​గా, కంఫర్ట్​గా అనిపిస్తుంది. సెకెండ్​ రోలో ఆర్మ్​ రెస్ట్​కి ఓ ప్రత్యేకత కూడా ఉంది. బాటిల్స్​, గ్లాస్​లు పెట్టుకునేందుకు స్పేస్​ లభిస్తోంది. ఇక సెంటర్​ ఆర్మ్​రెస్ట్​లో లగ్జరీ ఫీల్​ని తీసుకొచ్చే గ్లాస్​ హోల్డర్స్​ వస్తున్​నాయి. టచ్​ పానెల్స్​ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది.

సామర్థ్యం.. ఇందులోని 111కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ వెహికిల్​ 650కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. దీనిలో 496 హెచ్పీ, 909 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ కనెక్టవీటి ఉంటుంది. అనేక అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. అదే విధంగా 14.5 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..