ఆ ఒక్క సలహా జీవితాన్నే మార్చేసింది.. ఏకంగా గూగుల్‌కి సీఈఓను చేసేసింది! సుందర్ పిచాయ్ సక్సెస్ సీక్రెట్.. అస్సలు మిస్ అవ్వొద్దు
Sundar Pichai: మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా.. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అని. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితాన్ని ఒక్క సారి పరికించి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన శక్తి సామర్థ్యాలు, ప్రతిభతో పాటు తన భార్య అంజలి పిచాయ్ ప్రోత్సాహం, సూచనలు తన విజయానికి ప్రధాన కారణాలని అనేక సందర్భాల్లో సుందర్ పిచాయ్ చెప్పారు.
సుందర్ పిచాయ్ ఇది పరిచయం అక్కరలేని పేరు. మన దేశంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి.. అసామాన్య ప్రతిభతో ఏకంగా ప్రపంచానికి బిగ్ బాస్ లాంటి గూగుల్ కంపెనీకి సీఈవోగా ఎదిగారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్ కి 22.6 కోట్ల డాలర్లను 2022లో జీతంగా చెల్లించింది. దీనిని మన కరెన్సీలో లెక్కిస్తే రూ. 1,854 కోట్లు అంటే రోజుకు ఐదు కోట్ల ఆదాయం. ఈ ఆదాయంలో చాలా వంతు తన పేరుతో ఉన్న షేర్ల నుంచి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సుందర్ ఆదాయం సగటు గూగుల్ ఉద్యోగి ఆదాయం కన్నా రెండింతలు ఎక్కువ. సగటు గూగుల్ ఉద్యోగి నెల ఆదాయం రూ. 2.42 కోట్లు. ఆ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఆయన వెనుక ఉండి ప్రోత్సహించింది ఏవరు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా.. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అని. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితాన్ని ఒక్క సారి పరికించి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన శక్తి సామర్థ్యాలు, ప్రతిభ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆయన ఇంతటి స్థాయికి చేరుకోగలిగారు. ముఖ్యంగా సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ప్రోత్సాహం, తన సూచనలతో తన విజయం సాధ్యమైందని అనేక సందర్భాల్లో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఇది సుందర్ పిచాయ్ బయోగ్రఫీ..
సుందర్ పిచాయ్ జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించాడు. చెన్నైలో పెరిగారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. అమెరికాలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ చదివారు. 2004లో గూగుల్‌లో చేరాడు. 2019లో గూగుల్ సీఈఓ అయ్యారు. అయితే ఈ విజయ ప్రస్థానంలో ఆయన భార్య అంజలి పిచాయ్ ముఖ్యమైన పాత్ర పోషించారు.
అంజలి పిచాయ్ ఎవరూ..
అంజలి పిచాయ్ తన లింక్డ్‌ఇన్ ఖాతా ప్రకారం ఇన్ ట్యూట్(Intuit) అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందుకు యాక్సెంచర్ లో పనిచేశారు. ఆమె స్వస్థలం రాజస్థాన్‌లోని కోట. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆమె కూడా కెమికల్ ఇంజినీరింగ్లోనే పట్టా పొందారు. ఆమె తండ్రి కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగి.
సుందర్ లవ్ స్టోరీ ఇది..
ఐఐటీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే సుందర్ పిచాయ్‌తో అంజలికి స్నేహం కుదిరింది. అంజలి, సుందర్ పిచాయ్ ఇద్దరు కలిసే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్న సమయంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత సుందర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత వారు చాలా కాలం కనీసం మాట్లాడుకోలేదు. దీనికి కారణంగా ఆ సమయంలో సుందర్ దగ్గర తనకు కాల్ చేసి మాట్లాడేంత డబ్బు లేకపోవడమేనని ఓ సందర్భంలో సుందర్ చెప్పారు. ఆ తర్వాత వీరి వివాహం అయ్యింది. వీరికి కుమార్తె కావ్య, కుమారుడు కిరణ్ ఉన్నారు.
ఆ ఒక్క సలహా జీవితాన్ని మార్చేసింది..
సుందర్ తన ప్రస్తుత స్థానానికి అంజలిని క్రెడిట్ ఇచ్చారు. తానూ గూగుల్ లో పనిచేస్తున్న సమయంలో తన ప్రతిభను గుర్తించి యాహూ, ట్విటర్ వంటి సంస్థలు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఆ సమయంలో సుందర్ పిచాయ్ గూగుల్‌ను వదిలేయాలనుకున్నారు. అయితే అంజలి మాత్రం గూగుల్ ని వదలొద్దని సలహా ఇచ్చారు. దీంతో ఆ ఆఫర్లను సుందర్ వదిలేసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు సుందర్ ను ఉన్నతస్థాయిలో నిలబెట్టింది. ఏకంగా గూగుల్ కంపెనీకే సీఈవోను చేసింది. ఆ రోజు తాను అంజలి మాట వినకుండా ఆ ఆఫర్ల వైపు మొగ్గుచూపితే ఇంతటి స్థాయిలో ఉండేవాడిని కానని సుందర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..