Volkswagen Electric Car : కొత్త ఈవీ కార్ రిలీజ్ చేసిన వోక్స్‌వ్యాగన్.. మధ్యతరగతి వాళ్లే టార్గెట్

ఐడీ 2 ఆల్ కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించిన ఈ కార్‌ 2025లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం రూ.22 లక్షల ధరతో మధ్యతరగతి ప్రజలకు టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ కార్‌ను రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Volkswagen Electric Car : కొత్త ఈవీ కార్ రిలీజ్ చేసిన వోక్స్‌వ్యాగన్.. మధ్యతరగతి వాళ్లే టార్గెట్
Vw Id2all Reveal Front
Follow us
Srinu

|

Updated on: Mar 17, 2023 | 3:30 PM

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో టాప్ కంపెనీలన్నీ తమ ఈవీ వెహికల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇదే కోవలో ప్రముఖ్య కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ను ఆవిష్కరించింది. ఐడీ 2 ఆల్ కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించిన ఈ కార్‌ 2025లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం రూ.22 లక్షల ధరతో మధ్యతరగతి ప్రజలకు టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ కార్‌ను రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వోక్స్ వ్యాగన్ ఐడీ 2 ఆల్ కార్‌ను ఓ సారి చార్జి చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. వోక్స్ వ్యాగన్ 2026 నాటికి సుమారు పది ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2026లో యూరోపియన్ బ్రాండ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శిస్తుంది. ఇది అయితే ప్రస్తుతం కంపెనీ రూ.17.50 లక్షలు కంటే తక్కువ ధర ఉండే ఈవీ కార్‌ను తయారు చేసే పనిలో ఉంది. ముఖ్యంగా యూరప్‌లోని ఈవీ సెగ్మెంట్‌లో 80 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మార్కెట్ వర్గాల టాక్.

వోక్స్‌వ్యాగన్ ఐడీ2 ఆల్ ఫీచర్లు ఇవే

ఈ బ్రాండ్ న్యూ ఈవీ కార్‌లో మ్యాట్రిక్స్ హెడ్‌లైట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, త్రీడీ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ క్లస్టర్‌ల మధ్య సమాంతర ఎల్‌ఈడీ స్ట్రిప్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.ఈ కార్ క్యాబిన్ వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్‌లా విశాలంగా ఉంటుంది. ఈ కార్‌లో ముఖ్యంగా ట్రావెల్ అసిస్ట్, మెమరీ ఫంక్షన్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్, అలాగే మసాజ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సీట్లు ఉంటాయి. 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 10.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి అనేక యూఎస్‌బీ సీ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయని కంపెనీ ప్రతినిదులు చెబతున్నారు. ముఖ్యంగా ఈ కార్ 223 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కార్ కేవలం 7 సెకన్లలోపు 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే డీసీ త్వరిత ఛార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కార్ 11 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్‌తో కూడా అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్-వీల్-డ్రైవ్ కారు అయినందున ఈ కార్ గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'ఢిల్లీ సీఎం అతిషీని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషీని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..