Ola Electric: దెబ్బకు కళ్లు తెరుచుకున్న ఓలా.. కస్టమర్లకు ఉచితంగానే అందిస్తామని ఆహ్వానం.. అసలు విషయం ఏమిటంటే..

ఇటీవల ఎస్1 స్కూటర్ పై ఓ యువకుడు సుమారు 35 kmph వేగంతో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ విరిగిపోయి కింద పడిపోయాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఓలా తీవ్ర విమర్శలపాలైంది.

Ola Electric: దెబ్బకు కళ్లు తెరుచుకున్న ఓలా.. కస్టమర్లకు ఉచితంగానే అందిస్తామని ఆహ్వానం.. అసలు విషయం ఏమిటంటే..
Ola S1 Pro
Follow us
Madhu

|

Updated on: Mar 17, 2023 | 3:17 PM

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ ఓలా. విద్యుత్ శ్రేణి ద్విచక్ర వాహనాల్లో అత్యాధునిక ఫీచర్లను ప్రవేశపెట్టి, అత్యంత నాణ్యతతో వాహనాలు వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన ఓలాకు షాక్ ఇచ్చింది. ఎంతలా అంటే ఇప్పటి వరకూ ఉన్న ఎస్1 బైక్ మోడళ్లు అన్నింటినీ ఉచితంగా అప్ గ్రేడ్ చేస్తామని ఓపెన్ ఆఫర్ల ఇచ్చేంత లా చేసింది. ఇంతకీ ఎంటా సంఘటన? ఓలా ఇచ్చిన ఉచిత ఆఫర్ ఏంటి? ఓసారి చూద్దాం రండి..

ఎస్1 స్కూటర్లలో..

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 స్కూటర్ల ఫ్రంట్ ఫోర్క్‌ ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. కంపెనీ తన నిరంతర ఇంజినీరింగ్, డిజైన్ మెరుగుదల ప్రక్రియలో భాగంగా ఇటీవలే ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను మరింత మన్నిక ఇచ్చేలా.. దాని బలాన్ని మరింత పెంచేలా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.

విమర్శలకు సమాధానం..

ఎస్1 స్కూటర్లలో ఫ్రంట్ సస్పెన్షన్ బ్రేకేజ్‌ల నివేదికలపై ఓలా ఇటీవలి నెలల్లో విమర్శలను ఎదుర్కొంది. దీనిపై మార్చి 14న ఓలా ఎలక్ట్రిక్ ట్విట్టర్ పోస్ట్‌లో సమాధానం ఇచ్చింది. “ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ భద్రత గురించి వినియోగదారుల్లో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఇది నిరాధారమైనదని మేము మీకు హామీ ఇస్తున్నాం.” అని పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించడానికి ఓలా ఎలక్ట్రిక్ “కొత్త ఫ్రంట్ ఫోర్క్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు సమీప ఓలా సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఉచితంగా ఫ్రంట్ ఫోర్క్ ను మార్చుకోవచ్చని వివరించింది.

ఇవి కూడా చదవండి

అసలు ఏమైంది..

ఇటీవల ఎస్1 స్కూటర్ పై ఓ యువకుడు సుమారు 35 kmph వేగంతో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ విరిగిపోయి,యువకుడు కింద పడిపోయాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఓలా తీవ్ర విమర్శలపాలైంది. ఎస్1 ఫోర్క్ లో లోపాలున్నట్లు అంతా మండిపడ్డారు. దీనిపై ఓలా కంపెనీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టి.. తమ విశ్లేషణలో ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపిన రోడ్డు ప్రమాదం అని నిర్ధారించింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, ఓలా ఎలక్ట్రిక్ తమ స్కూటర్‌లలోని ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్‌తో సహా అన్ని భాగాలు “తీవ్రమైన పరిస్థితులలో పూర్తిగా పరీక్షించబడ్డాయి.. వాహనాలపై ఉండే సాధారణ లోడ్‌ల కంటే చాలా ఎక్కువ భద్రతతో రూపొందించబడ్డాయి” అని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?