Vinayaka Chavithi 2024: మార్కెట్‌లో ఉత్సాహం నింపిన వినాయక చవితి, రూ. 25000 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగిందని అంచనా..

వినాయక చవితి సందర్బంగా మార్కెట్‌లో జనంతో సందడి నెలకొంది. మార్కెట్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతో భారతీయ వస్తువులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. కొనుగోలుదారుల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. CAT అంచనా ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున భారతదేశం అంతటా సుమారు రూ. 25000 కోట్ల వ్యాపారం జరుగినట్లు అంచనా..

Vinayaka Chavithi 2024: మార్కెట్‌లో ఉత్సాహం నింపిన వినాయక చవితి, రూ. 25000 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగిందని అంచనా..
Vinayaka Chaturthi
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2024 | 4:44 PM

వినాయక చవితి పండగను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దేశంలో వినాయక చవితి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ఈ పండగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ సీజన్ వ్యాపారవేత్తలకు అద్భుతంగా ఉందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్బంగా మార్కెట్‌లో జనంతో సందడి నెలకొంది. మార్కెట్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతో భారతీయ వస్తువులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. కొనుగోలుదారుల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. CAT అంచనా ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున భారతదేశం అంతటా సుమారు రూ. 25000 కోట్ల వ్యాపారం జరుగినట్లు అంచనా..

20 లక్షలకు పైగా గణేష్ మండపాలు

వినాయక చవితి వేడుకల్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆల్ ఇండియా ట్రేడర్స్ క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. క్యాట్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రాష్ట్రాల్లో స్థానిక వ్యాపారవేత్తలు నిర్వహించిన సర్వేలో దాదాపు 20 లక్షలకు పైగా గణపతి మండపాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో మండపానికి కనీస ఖర్చు రూ.50,000 అని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం మండపాలకు మొత్తం రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.

వీటిపై పెరిగిన ఖర్చు

ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పిన ప్రకారం గణపతి విగ్రహాల వ్యాపారం రూ.500 కోట్లకు పైగానే సాగినట్లు తెలుస్తోంది. పూలు, దండలు, పండ్లు, కొబ్బరి, ధూపం, ఇతర పూజా సామాగ్రి విక్రయాలు కూడా దాదాపు రూ.500 కోట్లకు చేరువలో ఉన్నాయి. స్వీట్ షాపులు, గృహ వ్యాపారాలకు సంబంధించి రూ. 2000 కోట్లకు పైగా అమ్మకాలు పెరిగాయి. అంతేకాదు కుటుంబీకుల వారీగా పెద్ద పెద్ద ఫంక్షన్లు, విందులు నిర్వహించడం వల్ల క్యాటరింగ్, స్నాక్స్‌పై దాదాపు రూ.3000 కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ వస్తువుల అమ్మకాలు పెరిగే అవకాశం..

BC భారతియా ప్రకారం వినాయక చవితి సందర్భంగా పర్యాటకం, రవాణా వ్యాపారం కూడా ఊపు అందుకుంటుంది. ట్రావెల్ ఏజెన్సీలు, హోటళ్లు , రవాణా సేవలకు (బస్సులు, టాక్సీలు, రైళ్లు వంటివి) భారీ డిమాండ్‌ నెలకొంది. వీటి వృద్ధిని చూస్తుంటే దీని టర్నోవర్ రూ. 2000 కోట్లకు మించవచ్చని చెప్పారు. రిటైల్, సరుకుల గురించి మాట్లాడితే పండుగకు సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, ఇంటి అలంకరణ, బహుమతి వస్తువుల అమ్మకాలు కూడా రూ. 3000 కోట్లకు చేరుకోవచ్చని తెలిపారు. అంతేకాదు వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ సేవలు కూడా భారీగా ప్రోత్సాహాన్ని పొందుతాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కూడా దాదాపు రూ. 5000 కోట్ల మేర వ్యాపారాన్ని చేసినట్లు చెప్పారు.

మరిని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..