Vande bharat: తెరుచుకోని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ డోర్లు.. గంట పాటు నిలిచిపోయిన రైలు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ రైలు.. దేశ వ్యాప్తంగా మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలుకు అనూహ్య స్పందన వస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ రైలు.. దేశ వ్యాప్తంగా మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలుకు అనూహ్య స్పందన వస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే ఈ రైలు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. అయితే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి నుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి బయలుదేరిన వందేభారత్ రైలు ఈరోజు ఉదయం 8.20 గంటలకు సూరత్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
అయితే ఈ సమయంలో రైలు సూరత్ రైల్వే స్టేషన్‌లో గంట పాటు నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. డోర్లు తెరవకపోవడంతో ఎక్కువసేపు ఆగాల్సి వచ్చింది. ఇంతలో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత తలుపులు ఓపెన్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు సుమారు గంటపాటు రైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. చాలా సార్లు వార్తల్లోకెక్కిన వందే భారత్ రైలు.. ఇప్పుడు డోర్లు ఓపెన్ కాక మరోసారి వార్తల్లోకెక్కింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి