తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు రూ. 514.36 కోట్ల భారీ బోనస్‌ను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల క్లియరెన్స్ కోసం ఈ నిధులు కేటాయించింది. క్వింటాల్‌కు రూ. 500 చొప్పున సుమారు 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తం నేరుగా జమ కానుంది. వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.