AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..

బ్యాంకుల కస్టమర్లకు రక్షణ కల్పించేలా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకులకు పలు కీలక నిబంధనలు విధించింది. జులై 1వ తేదీ నుంచి వీటిని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వీటి వల్ల బ్యాంకుల కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

RBI New Rules: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. ఆర్బీఐ కొత్త గైడ్‌లైన్స్.. అన్ని బ్యాంకుల కస్టమర్లు తెలుసుకోవాల్సిందే..
Rbi Banking Rules
Venkatrao Lella
|

Updated on: Feb 17, 2026 | 12:04 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే రీఫండ్, పరిహారం కస్టమర్లకు అందించాల్సి ఉంటుది. అలాగే ఆర్బీఐ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే..

– ఉత్పత్తులను విక్రయించే ఏజెంట్లను బ్యాంక్ సిబ్బంది నుంచి వేరు చేయాలి – బ్యాంకులు అమ్మకాల ప్రవర్తనా నియమావళి రూపొందించుకోవాలి – నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులు జరిమానా విధించుకోవచ్చు – వివిధ సేవలు, ప్రొడక్ట్స్‌కు విడివిడిగా ఆమోదం పొందాలి.. అన్నింటిని కలిపి ఉంచకూడదు – నిబంధనలను చదవపోతే కస్టమర్లకు ఆమోదం ఇవ్వలేని విధంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేయాలి – బ్యాంకులు థర్డ్ పార్టీ ఉత్పత్తులను నేరుగా ప్రమోట్ చేయకూడదు – బ్యాంకు ఉద్యోగుల వల్లే ఏజెంట్ల ప్రవర్తన ఉండకూడదు – ముందస్తు అనుమతి లేకుండా కస్టమర్లకు ఏజెంట్లు లేదా సిబ్బంది కాల్ చేయకూడదు లేదా కలవకూడదు – ప్రొఫైల్, వయస్సు, ఆదాయం, ఆర్ధిక సమాచారం, రిస్క్ తీసుకునే సత్తా ఆధారంగా ఉత్పత్తులను విక్రయించాలి – తప్పుదారి పట్టించే సమాచారం లేదా కస్టమర్ అనుమతి లేకుండా సేవలను అమ్మడం చేయకూడదు – ఆఫర్‌ను పొడిగించేందుకు రెండో బీమా పాలసీ కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు – బ్లాక్ ఆర్గారిధమ్ ఉపయోగించి కస్టమర్లను మోసం చేసేలా ఏ పని చేయకూడదు

తప్పుగా ఉత్పత్తులు అమ్మితే..

ఒకవేళ తప్పుగా కస్టమర్లకు ఉత్పత్తులు అమ్మితే తిరిగి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లావాదేవీలను రద్దు చేయాల్సి ఉంటుంది. దాని వల్ల కలిగిన ఆర్ధిక నష్టానికి సరియైన పరిహారం అందించాల్సి ఉంటుంది. ప్రొడక్ట్ అమ్మిన 30 రోజుల తర్వాత కస్టమర్లకు ఫోన్ చేసి అభిప్రాయం అడగాలి. బ్యాంకులు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఫలితాలపై నివేదికను సిద్దం చేసుకోవాలి. జులై 1వ తేదీ నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా ఏవైనా తప్పుడు ఉత్పత్తులు అమ్మితే బ్యాంకులకు కస్టమర్లు ఫిర్యాదు చేయాలి. 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త నియమాలతో బ్యాంకింగ్ కస్టమర్లకు మరింత రక్షణ ఏర్పడనుంది.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.