AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: మీరు వందేభారత్‌ రైలు ఎక్కేలోపు డోర్లు క్లోజ్‌ అయ్యాయా? అప్పుడేం చేయాలో తెలుసా?

Vande Bharat: వందే భారత్ వంటి హైటెక్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు తరచుగా తాము సాధారణ రైలులో ప్రయాణిస్తున్నట్లు భావిస్తారు. అయితే, ఈ సాంకేతికత కొన్నిసార్లు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రైళ్ల ఆటోమేటిక్ గేట్లు ముందుగానే మూసివేసినప్పుడు ప్రయాణికులు ఎక్కకుండా ఉండిపోవాల్సి ఉంటుంది..

Vande Bharat: మీరు వందేభారత్‌ రైలు ఎక్కేలోపు డోర్లు క్లోజ్‌ అయ్యాయా? అప్పుడేం చేయాలో తెలుసా?
Vande Bharat
Subhash Goud
|

Updated on: Feb 06, 2026 | 5:37 PM

Share

Vande Bharat: భారతదేశ రైల్వే వ్యవస్థ కొత్త యుగంలోకి ప్రవేశించింది. ఆధునిక సాంకేతికత, విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణాన్ని గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేశాయి. వందే భారత్ వంటి హైటెక్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు తరచుగా తాము సాధారణ రైలులో ప్రయాణిస్తున్నట్లు భావిస్తారు. అయితే, ఈ సాంకేతికత కొన్నిసార్లు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ రైళ్ల ఆటోమేటిక్ గేట్లు ముందుగానే మూసివేసినప్పుడు ప్రయాణికులు ఎక్కకుండా ఉండిపోవాల్సి ఉంటుంది. వందేభారత్‌ రైళ్లలో ఆటోమేటిక్‌గా డోర్స్‌ మూసుకుంటాయి.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని తలుపులు ఆటోమేటిక్ సిస్టమ్‌కు అనుసంధానించి ఉంటాయి. రైలు బయలుదేరే సమయానికి చేరుకున్నప్పుడు డోర్స్‌ వాటికవే క్లోజ్‌ అవుతాయి. దీంతో రైలు నెమ్మదిగా ముందుకు కదలడం ప్రారంభిస్తుంది.

Home Loan: రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. ఎలాగో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సూపర్‌ ట్రిక్‌!

ప్రయాణికులు కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించకుండా నిరోధించడం ద్వారా భద్రతను పెంచడం ఈ వ్యవస్థ ఉద్దేశించారు. అయితే ప్రయాణికులు రైలును పట్టుకోవడానికి సినిమా తరహా హడావిడిగా పరిగెత్తకుండా కూడా ఇది నిరోధిస్తుంది. అందుకే కొంచెం ఆలస్యం అయినా చాలా మంది తమ రైళ్లను కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Investment Plan: నెలకు రూ.1000, ఒకేసారి లక్ష పెట్టుబడి.. 20 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన ఈ రైలును 2019 నుండి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది మోదీ సర్కార్. కేవలం స్పీడ్ మాత్రమే కాదు సాధారణ రైళ్లకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యవంతమైన సీటింగ్ కలిగి ఉంటుంది. అలాగే ప్రయాణికులకు, వైఫై, నాణ్యమైన ఫుడ్, మరింత భద్రత లభిస్తుంది. ఈ రైలు మరో ప్రత్యేకత ఏంటంటే అటోమేటిక్ ప్లగ్ డోర్లు.

అయితే వందే భారత్ రైల్లో ప్రయాణించేవారికి కొన్నిసార్లు ఈ ఆటోమేటిక్ డోర్లు క్లోజ్‌ కావడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. చాలా తక్కువ సమయం డోర్లు తెరిచివుండటం వల్ల కొందరు ట్రైన్ మిస్ అవుతున్నారు… మరికొందరు గమ్యస్థానంలో దిగలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు ఏం చేయాలో తెలుసుకుందాం..

అయితే ఇలాంటి సమయంలో కాస్త తెలివిగా వ్యవహరిస్తే ట్రైన్ ను సులభంగా పట్టుకోవచ్చు. వందే భారత్ ట్రైన్ ట్రైన్ అన్నిబోగీల డోర్లు క్లోజ్ అయినా చివర్లో గార్డ్ ఉండే బోగీ మాత్రం తెరిచి ఉంటుంది. అందుకే వెంటనే చివరిబోగీ వద్దకు చేరుకుని గార్డు బోగీలో ఎక్కవచ్చు. అక్కడినుండి మీరు బుక్ చేసుకున్న సీటువద్దకు చేరుకోవచ్చు.

Phone Lost: మీ మొబైల్ పోగొట్టుకున్నారా? నష్టపోకుండా ఉండాలంటే ఆ 15 నిమిషాలే కీలకం.. అదేంటో తెలుసా?

దిగకుండానే డోర్లు క్లోజ్ అప్పుడేం చేయాలి?

ఇక లగేజీ ఎక్కువగా ఉండటంతో కొందరు నిర్ణీత సమయంలో వందే భారత్ రైలులోంచి దిగకుంఆడ అందులోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కూడా చివరి బోగీకి చేరుకుని గార్డును రిక్వెస్ట్ చేసి దిగిపోవచ్చు. అయితే ఇవన్ని ఇబ్బందులకంటే ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ముందుగానే లగేజీతో డోర్ వద్దకు చేరుకోవడం ఉత్తమం.

Airline: విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. తర్వాత ఏం జరిగిందో తెలుసా? షాకిచ్చిన కోర్టు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి