Flipkart Sales: ఫ్లిప్ కార్ట్ లో వ్యాలెంటైన్స్ డే ఆఫర్స్.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపు
ఫ్లిప్ కార్ట్ వ్యాలెంటైన్ వీక్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఎంపిక చేసిన ఉత్పతులపై 80 శాతం తగ్గింపును అందిస్తుంది.

ప్రేమ అంటేనే ఓ మధురమైన అనుభూతి. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ప్రేమికుల రోజున తమ పార్ట్ నర్ కు మంచి గిఫ్ట్ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపర్చాలని కోరుకుంటారు. ఇలాంటి వారిని టార్గెట్ ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వ్యాలెంటైన్ వీక్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. ఎంపిక చేసిన ఉత్పతులపై 80 శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ సేల్ ను ఫిబ్రవరి 6 నుంచి 12 వరకూ ఉంటుంది. అలాగే ఈ సేల్ లో 100 కంటే ఎక్కువ బ్రాండ్ ల గిఫ్ట్ కార్డులపై 50 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ క్రాఫ్ట్ ఇండియాపై యాభై శాతం, ఇండి గిఫ్ట్ కార్డులపై 80 శాతం తగ్గింపు వస్తుంది.
అదిరిపోయే కాంబో ఆఫర్లు
ఈ సేల్ లో ముఖ్యంగా కాంబో ఆఫర్లను అందిస్తుంది. జ్యూయలరీ కాంబో, కుషన్ కాంబో, కీచైన్ కాంబో, షోపీస్ కాంబో, వాచ్ కాంబో, ఆర్టిఫిషియల్ కాంబో పై ఆకర్షణీయమైన డీల్స్ ను అందిస్తుంది. పెర్ఫ్యూమ్ లు, పర్సనల్ కేర్, గార్మెట్ గిఫ్ట్ బాక్స్ మొదలైన ఇతర గిఫ్ట్ ఐటమ్స్ పై తగ్గింపు పొందవచ్చు. అంతర్జాతీయ విమాన బుకింగ్స్ పై ఫ్లిప్ కార్ట్ రూ.25000 వరకూ తగ్గింపును అందిస్తుంది. అలాగే దేశీయ విమాన బుకింగ్స్ పై 20 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. అలాగే దుబాయ్ వెళ్లే ఫ్లైట్స్ పై 20 శాతం తగ్గింపు వస్తుంది. రూ.999 ఈఎంఐతో మాల్దీవ్స్ కు కూడా టూర్ కు వెళ్లవచ్చు. అలాగే ఫ్లిప్ కార్ట్ ద్వారా హోటల్ బుక్ చేసుకుంటే 60 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లు టూర్ ప్లాన్ చేయాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం వరకూ అపరమిత క్యాష్ బ్యాక్ పొందవచ్చు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




