EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
ఆధార్ అథెంటికేషన్ సేవల ప్రస్తుతం అందుబాటులో లేదంటూ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు 'ఎక్స్' వేదికగా తెలిపారు. దీంతో దీనిపై స్పందించిన ఈపీఎఫ్‌ఓ అధికారులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆధార్ అథెంటికేషన్‌కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ఓ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ఆధార్ అథెంటికేషన్ సేవల ప్రస్తుతం అందుబాటులో లేదంటూ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఓ ఖాతాదారుడు.. గత నాలుగు రోజులుగా తాను ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. దీంతో దీనిపై స్పందించిన ఈపీఎఫ్‌ఓ అధికారులు.. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణాల వల్ల ఆధార్ అథెంటికేషన్ సేవలకు అంతారయం కలిగిందని. ఇందుకుగాను తాము చింతిస్తున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Dear member, all services utilizing Aadhar authentication will remain impacted due to technical maintenance of Aadhar setup of EPFO. Inconvenience caused is deeply regretted. https://t.co/GMl8MGEmfu
— EPFO (@socialepfo) February 28, 2024
ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అకౌంట్‌ను డూప్లికేట్ చేసే ముప్పు తగ్గించడంతో పాటు, వ్యక్తిగత వివరాల డేటాలో తప్పులు ఉండే అవకాశం తగ్గించడానికి, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరం చేయడానికి ఆధార్‌తో లింక్ చేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈపీఎఫ్ 277 మిలియన్లకు పైగా ఖాతాలు, దాదాపు రూ.20 లక్షల కోట్ల కార్పస్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..