UPI Transactions: మీ మొబైల్ నుంచి యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా..? ఏ బ్యాంకు ఎంత లిమిట్..!
UPI Transactions: UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అనేది నేటి వేగవంతమైన, సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. కానీ దీనితో లావాదేవీ పరిమితి వరకు మాత్రమే..
UPI Transactions: UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) అనేది నేటి వేగవంతమైన, సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. కానీ దీనితో లావాదేవీ పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. UPI పరిమితి మీ బ్యాంక్‌పై ఆధారపడి ఉంటుంది. లావాదేవీ పరిమితి అంటే ఒకేసారి చేసిన లావాదేవీ. రోజువారీ పరిమితి ఉంటుంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో UPI ద్వారా లావాదేవీ పరిమితి లక్ష రూపాయలు ఉండగా, రోజు వారీ పరిమితి కూడా లక్ష రూపాయలు.
- యాక్సిస్ బ్యాంక్: బ్యాంక్ UPI లావాదేవీ పరిమితి లక్ష రూపాయలు ఉండగా, అలాగే రోజువారీ యూపీ పరిమితి లక్ష రూపాయలు.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ బ్యాంకు UPI సేవలు వినియోగించుకోవాలంటే లావాదేవీ పరిమితి, రోజువారీ పరిమితి కూడా లక్ష రూపాయలుగా నిర్ణయించింది బ్యాంకు.
- HDFC బ్యాంక్: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ UPI లావాదేవీ, రోజువారీ పరిమితి కూడా లక్ష రూపాయలు మాత్రమే. అయితే, కొత్త కస్టమర్ మొదటి 24 గంటల్లో కేవలం రూ.5,000 లావాదేవీని మాత్రమే చేయగలరు.
- ICICI బ్యాంక్: ఈ బ్యాంక్ UPI లావాదేవీ పరిమితి, రోజువారీ పరిమితి కూడా రూ. 10,000. ఇక Google Pay వినియోగదారులకు రెండు పరిమితులు రూ. 25,000.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఈ బ్యాంకు లావాదేవీ పరిమితి రూ. 25,000కాగా, రోజువారీ యూపీఐ పరిమితి కూడా రూ.50,000గా నిర్ణయించబడింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి