AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Cars: ఈ ఐదు కార్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.. ధర రూ.10 లక్షల లోపే

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి ఆల్టో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, హ్యుందాయ్ i10, i20, వెన్యూ పేర్లతో సహా అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని తక్కువ ధరల్లోనే కార్లను కొనుగోలు..

Upcoming Cars: ఈ ఐదు కార్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.. ధర రూ.10 లక్షల లోపే
Car
Subhash Goud
|

Updated on: Oct 16, 2022 | 5:56 PM

Share

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి ఆల్టో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, హ్యుందాయ్ i10, i20, వెన్యూ పేర్లతో సహా అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని తక్కువ ధరల్లోనే కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి త్వరలో భారతీయ కార్ మార్కెట్‌లోకి వస్తాయి. ఈ కార్లన్నీ రూ.10 లక్షల లోపే ఉంటాయి. రాబోయే కొద్ది వారాల్లో ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దీపావళి పండగ సీజన్‌లో మంచి తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే కాలంలో విడుదల చేయనున్న కొన్ని సరికొత్త కార్ల గురించి తెలుసుకోండి.

ఈ 5 కార్లు త్వరలో భారత మార్కెట్లోకి విడుదల

  1. మారుతి వైటీమీ అంచనా ధర రూ.8 లక్షల లోపు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారత్‌లో దూసుకుపోతుంది. అలాగే, ఈ కారులో 1.0-లీటర్ బూస్టర్ జెట్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌. అలాగే, బాలెనో మాదిరిగానే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో ఉంటుంది.
  2. మారుతి స్విఫ్ట్ ధర రూ.6-7 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. మారుతి ఈ కొత్త కారు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌తో పోటీపడనుంది. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారును ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయవచ్చు. తదుపరి తరం స్విఫ్ట్ కారులో కొత్త ఇంటీరియర్, కొత్త క్యాబిన్, కొత్త పవర్‌ట్రెయిన్ ఎంపికను చూడవచ్చు.
  3. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అంచనా ధర రూ. 5-6 లక్షలు. ఇది ప్రస్తుతం హ్యుందాయ్ అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్ కారు. కొత్త అప్‌డేట్ కింద వినియోగదారులు అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లను, సరి కొత్త ఇంటీరియర్‌లు ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో రూపొందించినట్లు తెలుస్తోంది.
  4. మహీంద్రా బొలెరో నియో ప్లస్ అంచనా ధర రూ. 10-12 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ట్రయల్‌ పరీక్షలో మంచి గుర్తింపు పొందింది. ఈ కారులో 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ రకమైన ఇంజన్‌ను థార్‌లో కూడా చూడవచ్చు. ఈ కారు 7 సీట్లతో రానుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. టయోటా కాంపాక్ట్ కూపే SUV అంచనా ధర దాదాపు రూ.8 లక్షలు ఉండవచ్చు. ఇది ఎక్స్-షోరూమ్ ధర అవుతుంది. ఈ బాలెనో ఆధారిత కారు కూపే తరహా ఎస్‌యూవీ కారు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి