AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Number: మీ ఆధార్ నంబర్ మరొకరికి తెలిస్తే అది బ్యాంకు మోసానికి దారితీస్తుందా?

ఈ రోజుల్లో ఆధార్‌ చాలా ముఖ్యమైనది. ముఖ్యమైన పత్రాల్లో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలతో పాటు ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి అయ్యింది..

Aadhar Number: మీ ఆధార్ నంబర్ మరొకరికి తెలిస్తే అది బ్యాంకు మోసానికి దారితీస్తుందా?
Bank Fraud
Subhash Goud
|

Updated on: Oct 16, 2022 | 5:26 PM

Share

ఈ రోజుల్లో ఆధార్‌ చాలా ముఖ్యమైనది. ముఖ్యమైన పత్రాల్లో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలతో పాటు ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి అయ్యింది. పబ్లిక్ కంప్యూటర్లలో ఆధార్ కార్డును ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇటీవల ప్రజలకు సూచించింది. ఇంటర్నెట్ కేఫ్‌లు లేదా కియోస్క్‌లు వంటి పబ్లిక్ కంప్యూటర్‌లలో ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని యూఐడీఏఐ ఒక ట్వీట్‌లో ప్రజలను హెచ్చరించింది. మీరు ఆధార్‌ కోసం ఏదైనా వెబ్‌ సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత మళ్లీ లాగ్‌ అవుట్‌ కాకపోతే ఇబ్బందులు పడే ప్రమాదం ఉందంటున్నారు. డీమ్యాట్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతా తెరవడం, కేవైసీ ధృవీకరణ ప్రయోజనాల కోసం ఆధార్ ముఖ్యమైన పత్రంగా మారింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) నీలేష్ సంగోయ్ మాట్లాడుతూ.. మీ ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, చిరునామా లీక్ అయితే బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అయ్యే ప్రమాదం ఉండదని చెప్పారు. అయినప్పటికీ, లైబ్రరీలు, సైబర్ కేఫ్‌లు, హోటళ్లు మొదలైన వాటిలో పబ్లిక్ కంప్యూటర్‌లలో బ్యాంకింగ్ చేయడం మానుకోవాలని, పనిని పూర్తి చేసిన వెంటనే లాగ్ ఆఫ్ అవ్వాలని సాంగోయ్ ప్రజలకు సూచించారు.

వినియోగదారు ప్రామాణికతను ధృవీకరించడానికి అనేక బ్యాంకింగ్ భద్రతా ప్రోటోకాల్‌లు ఉన్నాయని వివరించారు. ఉదాహరణకు మీ ఏటీఎం కార్డ్‌లో పిన్‌, మీ నెట్-బ్యాంకింగ్ యాక్సెస్ ఓటీపీ, మీకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన క్యాచ్‌ఫ్రేజ్ ద్వారా రక్షించబడుతుందని అన్నారు. అలాగే మీ ఖాతాలో సంతకం, ఇతర పత్రాలు తయారు చేయబడి రికార్డులతో సరిపోలినందున ప్రమాదం ఉండదని, ఆధార్ కార్డును చూపించి బ్యాంకు శాఖలో మీ ఖాతా నుండి ఎవరూ నగదు తీసుకోలేరు అని అన్నారు.

హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేయలేరు

చికాగోకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ OneSpan, SAARC రీజియన్ కంట్రీ మేనేజర్ పినాకిన్ డేవ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు కస్టమర్ ఇంటర్నెట్ భద్రతతో సంబంధం లేకుండా సురక్షిత బ్యాంకింగ్ కోసం సర్టిఫికేట్ పిన్నింగ్ వంటి భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా మీ ఆధార్ నంబర్ మాత్రమే తెలిసిన తర్వాత హ్యాకర్లు మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసుకోలేరు. ఇతర సేవలను యాక్సెస్ చేయలేరని అన్నారు.

ఇవి కూడా చదవండి

సైబర్ మోసాల బాధితులు కావచ్చు:

మీ ఆధార్ నంబర్ తెలుసుకోవడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరు. కానీ అది దుర్వినియోగం చేయవచ్చు. ఇ-ఆధార్ అనేది మీ భౌతిక ఆధార్ కార్డ్ ఎలక్ట్రానిక్ కాపీ. ఇది అనేక సేవలకు కేవైసీ చెల్లుబాటు అయ్యే రుజువు. అందుకే మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి, మీ ఇ-ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి సైబర్ కేఫ్‌లను ఉపయోగిస్తుంటే మీరు సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లో పడవచ్చు.

మోసగాళ్లు మీ సమాచారాన్ని దొంగిలించవచ్చు:

ఆధార్‌ కోసం వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే సిస్టమ్ నుండి లాగ్ అవుట్ అవ్వాలని, డౌన్‌లోడ్ చేసిన అన్ని కాపీలను శాశ్వతంగా తొలగించాలని నిర్ధారించుకోండి. మీరు చేయకపోతే మోసగాళ్లు బొటనవేలు ముద్రలు, బయోమెట్రిక్ డేటా, ఇతర వివరాలతో సహా మీ సమాచారాన్ని దొంగిలించవచ్చు. వారు డిజిటల్ వేలిముద్రలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ పద్ధతులను ఉపయోగించి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి