AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: నయా టెక్నాలజీ కారులో పార్లమెంటుకు మంత్రి నితిన్ గడ్కరీ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ..

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తనదైన శైలిలో పార్లమెంటుకు వచ్చారు. తాను కేవలం మాటలకు పరిమితం కానని రుజువు చేశారు. తనతోటి మంత్రులకు సైతం ఆదర్శంగా నిలిచారు.

Nitin Gadkari: నయా టెక్నాలజీ కారులో పార్లమెంటుకు మంత్రి నితిన్ గడ్కరీ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ..
Nitin Gadkari
Ayyappa Mamidi
|

Updated on: Mar 30, 2022 | 1:03 PM

Share

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తనదైన శైలిలో పార్లమెంటుకు వచ్చారు. భారత్ లో ఎలక్ట్రిక్ మెుబిలిటీకి(Electric Mobility) రంగం సిద్ధమవుతున్న తరుణంలో ముందుగా తాను పాటించి ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేశారు గడ్కరీ. టొయోటా కంపెనీకి చెందిన Toyota Mirai హైడ్రోజన్ పవర్డ్ ఎలక్ట్రిక్ కారులో పార్లమెంటుకు చేరుకున్నారు. దీనికి ముందు గతంలో తన సహచర మంత్రులకు సైతం ఈవీలకు మారాలని ఆయన కోరారు. ఇంధనం కోసం రూ.100 ఖర్చు చేస్తున్నట్లయితే.. ఈవీల వాడకం వల్ల ఆ ఖర్చు కేవలం రూ.10కి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్(Hydrogen) నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ఇందుకోసం నీటి నుంచి తయారు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ను ప్రభుత్వం పరిచయం చేసినట్లు ఆయన అన్నారు. దీని వల్ల విదేశాల నుంచి ఇంధన దిగుమతులు తగ్గించుకోవటమే కాక.. దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి నితిన్‌ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ కారులో కిలో మీటరు ప్రయాణానకి కేవలం రూ.2 ఖర్చవుతుందని తెలుస్తోంది.

జనవరిలో తాను దిల్లీ రోడ్లపై కారులో కనిపిస్తానని.. భవిష్యత్తులో ఇంధనంగా ఉండే హైడ్రోజన్ ను ప్రజలందరూ ఉపయోగించేలా ప్రోత్సహిస్తానని గడ్కరీ గతంలో అన్నారు. జపాన్‌కు చెందిన టయోటా కంపెనీకి చెందిన కారులో.. ఫరీదాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ పంప్ తయారు చేసిన హైడ్రోజన్ ఇంధనంతో ప్రయాణిస్తానని గతంలో ఆయన అన్నారు. ఇప్పుడు దానిని ప్రతిబింబించే విధంగా పార్లమెంటుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సైతం పెట్రోల్ డీజిల్ వాహనాల స్థాయికి చేరుకుంటాయని కేంద్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు చెబుతున్నారు. రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, ఆటో రిక్షాల రేట్లు తగ్గుతాయని, దీనికోసం అవసరమైన జింక్ అయాన్, అల్యూమినియం అయాన్, సోడియం అయాన్ బ్యాటరీలను సిద్ధం చేస్తున్నట్లు గడ్కరీ అన్నారు.

ఇవీ చదవండి..

IPO Alert: ప్రస్తుత పరిస్థితుల్లో IPOల దారెటు.. కొత్తగా వచ్చేవి సక్సెస్ అవుతాయా..?

Stock Market: బుల్ జోరులో కొనసాగుతున్న మార్కెట్లు.. వరుస సెషన్లలో లాభాల పయనం..