AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Large Cap Equity Mutual Funds: ఆ కంపెనీల్లో పెట్టుబడితో మూడేళ్లల్లోనే నమ్మలేని లాభాలు.. టాప్‌ సెవెన్‌ కంపెనీలివే..!

చిన్న పొదుపు పథకాల వైపు స్థిర రాబడి కోసం కొంత మంది పెట్టుబడిదారులు వెళ్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం స్టాక్స్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. రిస్క్‌ అయినా పర్లేదు అనుకునే వారిక తక్కువ సమయంలో అధిక రాబడికి ఇవి సౌలభ్యంగా ఉంటాయి. ఇటీవల ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం మధ్య స్మాల్‌ క్యాప్, మిడాక్యాప్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ గేజ్ 5.11 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.20 శాతం క్షీణించింది. 

Large Cap Equity Mutual Funds: ఆ కంపెనీల్లో పెట్టుబడితో మూడేళ్లల్లోనే నమ్మలేని లాభాలు.. టాప్‌ సెవెన్‌ కంపెనీలివే..!
Stock Market
Nikhil
|

Updated on: Mar 18, 2024 | 5:45 PM

Share

ప్రస్తుత రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరూ చేసే పనే అయినా పెద్ద స్థాయి అవసరాలకు సొమ్ము లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే భవిష్యత్‌ అవసరాలను అర్థం చేసుకుని ఇప్పటి నుంచే పెట్టుబడి మార్గం వైపు పయనించే వాడే అప్పులపాలు కాకుండా ఉంటారని నిపుణుల భావన ఈ నేపథ్యంలో చిన్న పొదుపు పథకాల వైపు స్థిర రాబడి కోసం కొంత మంది పెట్టుబడిదారులు వెళ్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది మాత్రం స్టాక్స్‌లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. రిస్క్‌ అయినా పర్లేదు అనుకునే వారిక తక్కువ సమయంలో అధిక రాబడికి ఇవి సౌలభ్యంగా ఉంటాయి. ఇటీవల ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం మధ్య స్మాల్‌ క్యాప్, మిడాక్యాప్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ గేజ్ 5.11 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.20 శాతం క్షీణించింది.  అయితే ఇంత క్షీణతలో కూడా కొన్ని కంపెనీల పెట్టుబడిదారులు మాత్రం ఎలాంటి నష్టం లేకుండా లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం మూడేళ్ల నుంచి పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇస్తున్న లార్జ్‌క్యాప్‌ ఈక్విటీ కంపెనీల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్

ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 100 ఇండెక్స్‌లో ఉన్న నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్లో 23.09 శాతం, రెగ్యులర్ 22.06 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 23,307.26 కోట్లుగా ఉంది. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్

నిఫ్టీ 100 ఇండెక్స్‌లో ఒక భాగం అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్‌లో 20.29 శాతం, రెగ్యులర్లో 19.57 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 52,186.35 కోట్లుగా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

జేఎం లార్జ్ క్యాప్ ఫండ్

ఎస్‌అండ్‌ పీ బీఎస్‌ఈ 100 ఇండెక్స్ ఒక భాగం అయిన జేఎం లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్‌లో 19.77 శాతం, రెగ్యులర్ ప్లాన్లో 18.74 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 108.19 కోట్లుగా ఉన్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 ఫండ్

నిఫ్టీ 100 ఇండెక్స్ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్లో 20.08 శాతం, రెగ్యులర్ 19.37 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 31,859.12 కోట్లుగా ఉన్నాయి. 

బరోడా బీఎన్‌పీ పారిబాస్ లార్డ్ క్యాప్ ఫండ్

నిఫ్టీ 100 ఇండెక్స్ ఒక భాగం అయిన బరోడా బీఎన్‌పీ పారిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్లో 18.31 శాతం రాబడిని ఆర్జించింది. రెగ్యులర్‌లో 16.90 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 1,823.14 కోట్లుగా ఉన్నాయి. 

ఇన్వెస్కో ఇండియా లార్డ్ క్యాప్ ఫండ్

నిఫ్టీ 100 ఇండెక్స్‌లోని ఇన్వెస్కో ఇండియా లార్జ్‌ క్యాప్‌ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్లో 18.12 శాతం, రెగ్యులర్లో 16.44 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ. 955.75 కోట్లుగా ఉంది. 

ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్

నిఫ్టీ 100 ఇండెక్స్ ఒక భాగం అయిన ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్లో 17.63 శాతం, రెగ్యులర్లో 15.85 శాతం రాబడిని అందించింది. దీని నిర్వహణలో రోజువారీ ఆస్తులు (ఏయూఎం) రూ.786.62 కోట్లుగా ఉన్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..