AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Index Policy: ఎల్ఐసీ కొత్త పాలసీతో నమ్మలేని లాభాలు.. అదిరే రాబడితో పాటు జీవిత బీమా బోనస్

ఎల్ఐసీకు సంబంధించిన ఇండెక్స్ ప్లస్ అనేది యూనిట్-లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్. ఇది పాలసీ వ్యవధిలో పొదుపుతో జీవిత బీమా కవరేజీని మిళితం చేస్తుంది. నిర్దిష్ట పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ ఫండ్‌కు జోడించే వార్షిక ప్రీమియం శాతంగా హామీ ఇచ్చే జోడింపులను ప్లాన్ వాగ్దానం చేస్తుంది. ఈ బీమా 90 రోజులు చిన్నారి నుంచి 50-60 మధ్య వయస్సున్న వ్యక్తుల వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. వయస్సు ఆధారంగా ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది.

LIC Index Policy: ఎల్ఐసీ కొత్త పాలసీతో నమ్మలేని లాభాలు.. అదిరే రాబడితో పాటు జీవిత బీమా బోనస్
Lic Policy
Nikhil
|

Updated on: Mar 09, 2024 | 3:45 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇటీవల కొత్త ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ ప్లాన్ను ప్రారంభించింది. ఈ ప్లాన్ జీవిత బీమా కవరేజీతో పొదుపునకు సంబంధించిన సమ్మేళనంగా వస్తుంది. పాలసీదారుల ఆర్థిక భద్రతతో పాటు వృద్ధి అవసరాలను తీర్చడానికి రూపొందించారు. ఎల్ఐసీకు సంబంధించిన ఇండెక్స్ ప్లస్ అనేది యూనిట్-లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్. ఇది పాలసీ వ్యవధిలో పొదుపుతో జీవిత బీమా కవరేజీని మిళితం చేస్తుంది. నిర్దిష్ట పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ ఫండ్‌కు జోడించే వార్షిక ప్రీమియం శాతంగా హామీ ఇచ్చే జోడింపులను ప్లాన్ వాగ్దానం చేస్తుంది. ఈ బీమా 90 రోజులు చిన్నారి నుంచి 50-60 మధ్య వయస్సున్న వ్యక్తుల వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. వయస్సు ఆధారంగా ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది. కాబట్టి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ప్లాన్ చేయడంలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యం ఎల్ఐసీ ఇండెక్స్ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం

ప్రీమియంలు, నిబంధనలు

ప్రీమియం నిర్మాణం వివిధ వయసుల వారి ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించారు. 50 ఏళ్లలోపు వ్యక్తులకు ప్రాథమిక హామీ మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7 నుంచి 10 రెట్లు ఉంటుంది. అయితే 51 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారికి ఇది 7 రెట్లుగా ఉంటుంది. పాలసీ నిబంధనలు 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటాయి. ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ వ్యవధితో సమానంగా ఉంటుంది.

పెట్టుబడి, ఫండ్ ఎంపికలు

ఎల్ఐసీకు సంబంధించిన ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ అనే రెండు పెట్టుబడి నిధి ఎంపికలను అందిస్తుంది. ఈ ఫండ్లు ఎన్ఎస్ఈ నిఫ్టీ 100, ఎన్ఎస్ఈ నిఫ్టి 50 సూచికల నుంచి క్యూరేటెడ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. ఇవి వృద్ధి, రాబడిని ఆప్టిమైజ్ చేసే లక్ష్యంతో ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ప్రీమియం చెల్లింపు ఎంపికలు ఈ ప్లాన్ వివిధ బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీలను అందిస్తుంది సంవత్సరానికి రూ. 30,000 నుంచి ఎన్ఏసీహెచ్ ద్వారా నెలవారీ రూ. 2,500 వరకూ ఉంటుంది. కంపెనీ పూచీకత్తు నిర్ణయాలకు లోబడి ప్రీమియం మొత్తానికి గరిష్ట పరిమితి ఉండదు. 

ఇవి కూడా చదవండి

మెచ్యూరిటీ, ఉపసంహరణ

అదనపు ప్రయోజనాలు, ఉపసంహరణ ఎంపికలు పాలసీదారులు నిర్దిష్ట పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ ఫండ్ విలువను పెంచడం ద్వారా వార్షిక ప్రీమియం శాతం ఆధారంగా గ్యారెంటీ రాబడి ఉంటుంది. అదనంగా ఈ ప్లాన్ నిర్దిష్ట పరిస్థితులలో పాక్షిక ఉపసంహరణలను అనుమతిస్తుంది. పాలసీదారు మెచ్యూరిటీ సమయంలో యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని అందుకుంటారు. అయితే మరణ ప్రయోజనం చెల్లించాల్సి వస్తే నామినీలకు అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియంలతో పాటు మార్కెట్  రేటుకు అనుగుణంగా చెల్లిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...