AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ..

ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త విధానం అప్‌డేట్ ప్రక్రియను వేగంగా, సులభంగా మారుస్తుంది. అయితే అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజులు పెరిగాయి.

Aadhaar: ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ..
Krishna S
|

Updated on: Oct 27, 2025 | 10:54 AM

Share

ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ అందించింది. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు తీసుకరానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా,  సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం లక్ష్యం.

పెరిగిన అప్‌డేట్ ఫీజులు..

2025 సంవత్సరం ఆధార్ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా మారింది. ఈ సంవత్సరం UIDAI కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఫీజు పెరిగింది: అక్టోబర్ 1 నుంచే అప్‌డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా (పేరు, అడ్రస్) ఇప్పుడు రూ. 75, బయోమెట్రిక్ మార్పులకు రూ. 125 చెల్లించాలి.

పిల్లలకు ఫ్రీ: 7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చడానికి అయ్యే ఖర్చును UIDAI ఉచితం చేసింది.

ఒక ఆధార్-ఒక వ్యక్తి: నకిలీ ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI హెచ్చరించింది.

ఫ్రీ గడువు ముగిసింది: జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్‌డేట్‌లకు ఫీజు వర్తిస్తుంది.

నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్‌డేట్

నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే.. జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..