AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు సూపర్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంత తగ్గిందంటే..?

ఇది మహిళలకు గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూ.1000కిపైగా తగ్గడం గమనార్హం. వరుసగా గోల్డ్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ తగ్గింపు బిగ్ రిలీఫ్‌గా చెప్పొచ్చు. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే..?

Gold Price Today: మహిళలకు సూపర్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంత తగ్గిందంటే..?
Gold Price Drops Today
Krishna S
|

Updated on: Oct 27, 2025 | 10:27 AM

Share

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ మహిళలకు గట్టి షాకిస్తున్నాయి. బంగారం ధరల భగభగతో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఏడాది కిందట సుమారు రూ. 70,000 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా రూ. 1, 20,000 మార్కును దాటింది. అంటే ఒక్క ఏడాదిలోనే బంగారం ధర 60శాతం పెరగడం గమనార్హం. అయితే ఇవాళ బంగారం ధరలు తగ్గడం కొంత రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ గోల్డ్ ధరలు ఏకంగా రూ.వెయ్యికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480గా ఉంది. నిన్న ఇది రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,14,100 గా ఉంది. ఇది నిన్న రూ.1,15,150 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో చూసుకంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,24,480గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,14,100 ఉండగా.. నిన్న రూ.1,15,150గా ఉంది. అంటే నిన్నటికి ఇవాళ్టికి బంగారం ధరలు రూ.1140 రూపాయలు పెరిగింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.93,360గా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెంట్ల 10 తులాల బంగారం రూ.1,24,480గా ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,620గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,100గా ఉండగా.. నిన్న 1,15,150గా ఉంది. ఇక మన పక్క రాష్ట్రం తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,24,910 ఉంది. ఈ ధర నిన్న రూ.1,25,450గా ఉండేది. అదేవిధంగా బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,480గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,100గా ఉంది.

కాగా మూడు రోజుల ముందు వరుసగానాలుగైదు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ నెల 25న 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1250 పెరిగింది. దాంతో మహిళలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇవాళ తిరిగి బంగారం ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

వెండి ధరలు

ఇక వెండి ధరల విషయానికొస్తే హైదరాబాద్‌లో తులం వెండి రూ.1700గా ఉంది. ఇక కిలో వెండి రూ.1,70,000గా ఉంది. నిన్నటికి, ఇవాళ్టికి వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇక విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1700గా ఉండగా.. కిలో వెండి రూ.1,70,000గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..