Cab: క్యాబ్‌ బుకింగ్‌లోనూ బేరం ఆడొచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌.

కొన్ని సందర్భాల్లో క్యాబ్స్‌లో తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చూపిస్తుంటాయి. అయితే కాస్త బేరం ఆడితే బాగుంటుందని అనిపించినా ఏం చేయాలేని పరిస్థతి. యాప్‌లో ఎంత ఫేర్ చూపిస్తే అంత చెల్లించాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఉబర్‌ సంస్థ.. 'ఉబర్‌ ఫ్లెక్స్‌' పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను...

Cab: క్యాబ్‌ బుకింగ్‌లోనూ బేరం ఆడొచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌.
Uber Cab
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 07, 2024 | 7:40 AM

సాధారణంగా ఆటోలో ప్రయాణించాలనుకుంటే డ్రైవర్‌తో కచ్చితంగా బేరం ఆడుతాం. ఆటో అతను చెప్పినదానికంటే ఎంతో కొంత తక్కువ అడగడానికి ప్రయత్నిస్తాం. అయితే క్యాబ్‌ల రాకతో బేరం అనే పదం వినిపించకుండా పోయింది. యాప్‌లో ఎంత ధర చూపిస్తే అంత చెల్లించాల్సిందే. బేరం ఆడడానికి అసలు అవకాశమే ఉండదు. అయితే క్యాబ్‌ బుక్‌ చేసే సమయంలోనూ బేరం ఆడే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.? దీనినే నిజం చేయడానికి ప్రముఖ క్యాబ్‌ సర్వీస్ సంస్థ ఉబర్‌ ప్రయత్నాలు చేస్తోంది.

కొన్ని సందర్భాల్లో క్యాబ్స్‌లో తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చూపిస్తుంటాయి. అయితే కాస్త బేరం ఆడితే బాగుంటుందని అనిపించినా ఏం చేయాలేని పరిస్థతి. యాప్‌లో ఎంత ఫేర్ చూపిస్తే అంత చెల్లించాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే ఉబర్‌ సంస్థ.. ‘ఉబర్‌ ఫ్లెక్స్‌’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు రైడ్ బుక్‌ చేసుకునే సమయంలో సాధారణంగా కనిపించే ధరలకు బదులుగా తొమ్మిది విభిన్న ధరలు కనిపిస్తాయి. వీటిలో ఒక ప్రైజ్‌ డిఫాల్ట్‌గా ఉంటుంది. మిగితా ధరలు కస్టమర్ బేరం ఆడడానికి ఇచ్చినవి. యూజర్‌ ప్రయాణిస్తున్న, దూరం, సమయం ఆధారంగా ఈ తొమ్మిదింట్లో తనకు నచ్చిన ధరను ఎంచుకోవచ్చు. ఒకవేళ రైడర్‌ ఎంచుకున్న ధర డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజక్ట్ చేయొచ్చు. దీంతో అటు డ్రైవర్‌తో పాటు ఇటు రైడర్‌కు తనకు నచ్చిన ధర ఎంచుకునే అవకాశం ఉంటుంది.

కస్టమర్లు తమ రైడ్‌ ధరలను తామే ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఉబర్‌ చెబుతోంది. దీంతో తక్కువ ధరకే రైడర్లు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ప్రయాణించిన తర్వాత నగదు లేదా డిజిటల్ పద్ధతి ద్వారా పేమెంట్‌ చేయొచ్చు. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌ను ఉబర్‌ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పరీక్షిస్తోంది. భారత్‌తోపాటు లాటిన్‌ అమెరికా, కెన్యాలో పరీక్షిస్తోంది. భారత్‌ విషయానికొస్తే.. ఔరంగాబాద్‌, ఆజ్మీర్‌, బరేలీ, చండీగఢ్‌, కోయంబత్తూర్‌, దేహ్రాదూన్‌, గ్వాలియర్‌, ఇందౌర్‌, జోధ్‌పుర్‌, సూరత్‌ ప్రాంతాల్లో పరీక్షించినట్లు ఉబర్‌ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..