Best two wheelers: లక్ష రూపాయల్లో లక్షణమైన టూవీలర్స్..సామాన్యుల బెస్ట్ చాయిస్ ఇదే..!
ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీసం అవసరంగా మారింది. చదువు, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో బస్సులు,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణాలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. పెరిగిన జనాభా కారణంగా నగరాలు బాగా విస్తరించాయి.
ద్విచక్ర వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీసం అవసరంగా మారింది. చదువు, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో బస్సులు,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణాలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. పెరిగిన జనాభా కారణంగా నగరాలు బాగా విస్తరించాయి. శివారు ప్రాంతాలలో ఆవాసాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సొంత వాహనాల అవసరం కూడా ఎక్కువైంది. దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. వీరి ఆదాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తమకు అనుకూలమైన ధరలో ఉంటే వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. దాదాపు రూ,లక్ష లోపు వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతారు. దానికి అనుగుణంగా వివిధ కంపెనీలు ఆ ధరలో తమ వాహనాలను విడుదల చేస్తున్నాయి. సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్న ప్రముఖ కంపెనీ బెస్ట్ ద్విచక్ర వాహనాలను తెలుసుకుందాం.
టీవీఎస్ జూపిటర్ 110
ప్రముఖ కంపెనీ టీవీఎస్ నుంచి విడుదలైన జుపీటర్ 110 ద్విచక్ర వాహనం ఆకట్టుకుంటోంది. దీనితో ఆ కంపెనీ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నవీకరించింది. ఈ వాహనం బేస్ మోడల్ రూ.73,700కు అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ట్రిమ్ కోసం 87,250 వెచ్చించాలి. ఇవి రెండు ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధరలు.
హోండా యాక్టివా 6జీ
టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ తర్వాత రెండో ప్రత్యామ్నాయంగా హోండా యాక్టివా 6జీని చెప్పవచ్చు. దీని టాప్-స్పెక్ హెచ్ స్మార్ట్ వేరియంట్ 82,684 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)కు అందుబాటులో ఉంది. దీనిలో 109 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.73 బీహెచ్ పీ, 8.90 ఎన్ఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా ఎల్ఈడీ హెడ్‌లైట్, సైలెంట్ స్టార్టర్, సీటును తెరవడానికి డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, పెట్రోల్ క్యాప్, కీలెస్ ఆపరేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో కంపెనీ నుంచి విడుదలైన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనానికి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ద్విచక్ర వాహనాల మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బండి అని చెప్పవచ్చు. స్ప్లెండర్ ప్లస్ 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. 8,000 ఆర్ పీఎం వద్ద 7.91 బీహెచ్పీ, 6,000 ఆర్ఫీఎం వద్ద 8.05 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు నాలుగు స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానం చేశారు. ఈ బండి రూ. 78,286 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు అందుబాటులో ఉంది.
హోండా షైన్
సామాన్యులకు అందుబాటులో ఉన్న మరో మోటారు సైకిల్ హోండా షైన్. దీనిలోని 123cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 10.59 బీహెచ్ పీ, 11 ఎన్ ఎమ్ ఉత్తత్తి చేస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్‌ల కారణంగా ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది. బ్రేకింగ్ హార్డ్‌వేర్ ఫ్రంట్, రియర్ డ్రమ్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో ఆకట్టుకుంటుంది. హోండా షైన్ డిస్క్ వాహనం రూ.84,250కు లభిస్తుంది.
హోండా యాక్టివా 125
పైన తెలిపిన వాహనాలతో పాటు హోండా యాక్టివా 125కూ ఈ జాబితాలో చేరింది. ఈ బండి రూ. 89,429 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కు అందుబాటులో ఉంది. దీనిలోని టాప్ స్పెక్ హెచ్ స్మార్ట్ మోడల్ లో సైలెంట్ స్టార్ట్, కీలెస్ ఆపరేషన్ ఫీచర్ ఉన్నాయి. 124 సీసీ సింగిల్ సిలిండర్ మోటారు 8.19 బీహెచ్‌పీ, 10.4 ఎన్ఎమ్ విడుదల చేస్తుంది.
యమహా ఫాసినో 125
యమహా ఫాసినో 125 కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్న మరో వాహనం. దీని స్పెషల్ ఎడిషన్ మోడల్ 94,830 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కు లభిస్తుంది. దీనిలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 125 సీసీ ఎయిర్ కూల్డ్ మోటార్ 8.04 బీహెచ్ పీ, 10.03 ఎన్ఎమ్ ను విడుదల చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి