AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Apache: అపాచీ బైక్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. గ్రాండ్‌గా మార్కెట్లోకి ఎంట్రీ..

టీవీఎస్ మోటార్స్ సరికొత్త అపాచీ బైక్ ను లాంచ్ చేసింది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ పేరుతో అప్ గ్రేడెడ్ మోడల్ ను మన దేశానికి పరిచయం చేసింది. డ్యూయల్ చానల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెంట్ వంటి అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ బైక్ ఇటీవల గోవాలో జరిగిన టీవీఎస్ మోటోసోల్ లో దీనిని ఆవిష్కరించింది. ఈ బైక్ లైట్నింగ్ బ్లూ, మ్యాటీ బ్లాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

TVS Apache: అపాచీ బైక్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. గ్రాండ్‌గా మార్కెట్లోకి ఎంట్రీ..
TVS Apache RTR 160 4v
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 12, 2023 | 3:27 PM

Share

టీవీఎస్ మోటార్స్ సరికొత్త అపాచీ బైక్ ను లాంచ్ చేసింది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ పేరుతో అప్ గ్రేడెడ్ మోడల్ ను మన దేశానికి పరిచయం చేసింది. డ్యూయల్ చానల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెంట్ వంటి అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ బైక్ ఇటీవల గోవాలో జరిగిన టీవీఎస్ మోటోసోల్ లో దీనిని ఆవిష్కరించింది. ఈ బైక్ లైట్నింగ్ బ్లూ, మ్యాటీ బ్లాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1.34లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గోవాలో టీవీఎస్ మోటోసోల్ ఈవెంట్ నిర్వహించింది. రెండు రోజులపాటు దీనిని నిర్వహించింది. రెండో రోజు చివరిన ఈ థర్డ్ జనరేషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ బైక్ ను లాంచ్ చేసింది. దీనిలో డ్యూయల్ చానల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్ ఉంటుంది.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ..

ఈ బైక్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. లైటింగ్ బ్లూ, మ్యాటీ బ్లాక్ వంటి ఆప్షన్లలో ఉంటుంది. దీనిని రూ. 1,34,990లక్షలు (ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిలోని ఇంజిన్ 17.35బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది అధిక పవర్ టూ వెయిట్ రేషియో కలిగి ఉంటుంది. ఈ బైక్ లో డ్యూయల్ చానల్ ఏబీఎస్ రియల్ లిఫ్ట్ ప్రోటెక్షన్, మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్ తో కూడిన స్మార్ట్ గ్లోనెట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆరఎల్ వంటి ఫీచర్లు ఉంటాయి. రేసింగ్ తరహా బైక్ లను తీసుకొచ్చే క్రమంలో కంపెనీ పెట్రోనాస్ తో చేతులు కలిపింది. రెండు కలిపి సంయుక్తంగా పలు ఉత్పత్తులను సైతం లాంచ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ అపాచీ కొత్త వేరియంట్ లాంచింగ్ సందర్భంగా టీవీ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ మాట్లాడుతూ మోటోసోల్ ప్లాట్ ఫారంపై ఈ బైక్ లాంచ్ చేయడం ద్వారా బైకింగ్ కమ్యూనిటీలో వివిధ ఆసక్తులతో ఉండే వారికి దగ్గర చేశామన్నారు. ఈవెంట్లో రైడర్లు, కస్టమర్లు, ఔత్సాహికులు, మ్యూజిక్ లవర్స్ వంటి వారు ఉంటారు కాబట్టి తమ మార్కెటింగ్ బాగా జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చివిర రెండు రోజులు ఈవెంట్ మెమరబుల్ గా ఉంటుందనిన చెప్పారు.

డిజైన్ పరంగా కూడా పలు మార్పులు టీవీఎస్ చేసింది. మంచి స్పోర్టీ లుక్లో దీనిని తీర్చిదిద్దారు. దీని ఇంజిన్ సామర్థ్యం కూడా పెంచింది. ఈ ఇంజిన్ 17.35బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..