Bank Holiday: ఆగస్ట్‌ 20న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ నెలలో బ్యాంకుల సెలవులు

మంగళవారం ఆగస్టు 20న బ్యాంకులు మూతపడనున్నాయి. రాఖీ తర్వాత రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏ కారణం చేత బ్యాంకులను మూసి ఉంచుతుందో తెలుసుకుందాం..

Bank Holiday: ఆగస్ట్‌ 20న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ నెలలో బ్యాంకుల సెలవులు
Bank Holoiday
Follow us
Subhash Goud

|

Updated on: Aug 19, 2024 | 6:34 PM

మంగళవారం ఆగస్టు 20న బ్యాంకులు మూతపడనున్నాయి. రాఖీ తర్వాత రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏ కారణం చేత బ్యాంకులను మూసి ఉంచుతుందో తెలుసుకుందాం. భారతదేశంలోని అన్ని బ్యాంకులు జాతీయ, పబ్లిక్, రాష్ట్ర సెలవులు, అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో మూసివేయబడతాయి. ఇప్పుడు మంగళవారం ఆర్బీఐ బ్యాంకులను మూసివేస్తుంది. రేపు ఏ పండుగ కారణంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయో తెలుసుకుందాం.

మంగళవారం బ్యాంకులు ఎందుకు మూపి ఉంటాయి?

20 ఆగస్టు 2024 మంగళవారంనాడు కేరళ రాష్ట్రంలో బ్యాంకులు మూసి ఉంటాయి. శ్రీ నారాయణ గురు జయంతి కేరళ రాష్ట్ర పండుగ. ఈ రోజు పాఠశాలలు, కార్యాలయాలు, బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఇది సంఘ సంస్కర్త, సాధువు అయిన నారాయణ గురు జన్మదిన వేడుక.

ఇవి కూడా చదవండి

ఆగస్టులో బ్యాంకు సెలవుల జాబితా

  • ఆగస్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
  • ఆగస్టు 25: ఆదివారం సెలవు
  • ఆగస్టు 26: జన్మాష్టమి సందర్భంగా అన్ని నగరాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
  • ఆగస్ట్ 31: నాల్గవ శనివారం సెలవు

ఈ ఇక్కడ ఆదివారాలు మినహా మిగతా సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉండనున్నాయని గమనించండి.

ఇది కూడా చదవండి: Ambani Luxury Cars: ముఖేష్‌ అంబానీకి చెందిన ఈ 3 లగ్జరీ కార్ల ధర ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి