Financial Frauds: సైబర్ మోసగాళ్లకు అసలైన టార్గెట్ వారే.. భయం లేకుండా దోచేస్తున్నారంతే..!

భారతదేశ రక్షణ దళం పేరు వింటే సాధారణ ప్రజలకు కొంత భయంగా ఉంటుంది. మామూలుగా పోలీసులన్నా, ఆర్మీ అన్నా చాలా మంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు అంటే వారి ధైర్యసాహసాలతో పాటు డిమాండింగ్ వాయిస్ కారణంగా వారిని మోసం చేయలేరని భావిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక మోసగాళ్లు మాత్రం ఆర్మీ అధికారులనే టార్గెట్ చేసుకుంటున్నారు.

Financial Frauds: సైబర్ మోసగాళ్లకు అసలైన టార్గెట్ వారే.. భయం లేకుండా దోచేస్తున్నారంతే..!
Cyber Fraudsters
Follow us

|

Updated on: Aug 19, 2024 | 6:00 PM

భారతదేశ రక్షణ దళం పేరు వింటే సాధారణ ప్రజలకు కొంత భయంగా ఉంటుంది. మామూలుగా పోలీసులన్నా, ఆర్మీ అన్నా చాలా మంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు అంటే వారి ధైర్యసాహసాలతో పాటు డిమాండింగ్ వాయిస్ కారణంగా వారిని మోసం చేయలేరని భావిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక మోసగాళ్లు మాత్రం ఆర్మీ అధికారులనే టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు వృత్తి సంబంధిత విషయాల్లో తప్పితే ఆర్థిక అక్షరాస్యత విషయంలో కొంత వెనుకబడి ఉంటారు. ఇప్పుడు మోసగాళ్లు ఆ పాయింట్‌నే క్యాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్మీ అధికారులు రిటైరయ్యాక ఆధునిక ఆర్థిక మార్కెట్లు వారికి చాలా కొత్తగా ఉంటాయి. అందువల్ల మోసగాళ్లు వారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

సైబర్ నేరాలు

ఫిషింగ్ స్కామ్‌లు, గుర్తింపు దొంగతనం, ఆన్‌లైన్ స్కామ్‌ల వంటి సైబర్ క్రైమ్‌లు అనుభవజ్ఞులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ రకమైన మోసం. మే మొదటి వారంలో పూణేలోని ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తిని స్థానిక పోలీసులగా పేర్కొంటూ మోసగాళ్లు రూ. 3.1 కోట్లు మోసం చేశారు. ముఖ్యంగా వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తు పేరుతో బెదిరించి ఖాతా నుంచి సొమ్ము తస్కరించారు. ఆ సొమ్మును ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోని ఖాతాలకు జమ చేయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూణెలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

పెట్టుబడి మోసాలు

పెట్టుబడి మోసం మరొక స్కామ్. అసాధారణమైన అధిక రాబడిని ఆశించి సాంప్రదాయ పెట్టుబడి పథకాల్లో కాకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని కొంత మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ తరహా ఆలోచన ఉన్నవారికి మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య జరిగిన షేర్ ట్రేడింగ్ స్కామ్‌లో 262 మంది ఇన్వెస్టర్లు ఎక్కువగా రూ. 26.41 కోట్ల మాజీ సైనికులను మోసం చేశారనే ఆరోపణలపై పూణే పోలీసులు ఒక వ్యాపారవేత్తతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

ఇవి కూడా చదవండి

సాయం పేరుతో స్కామ్‌లు

ఈ స్కామ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా బాధితులను అప్రోచ్ అయి సాయం చేయాలని కోరుతూ ఉంటారు.  మోసగాళ్లు వాట్సాప్ ద్వారా యుద్ధ వితంతువుల సహాయం పేరుతో డబ్బు సహాయం కోరుతూ సందేశాలు పంపుతూ ఉంటారు. దేశానికి సేవలు అందించిన వ్యక్తి ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే సాయం చేస్తూ ఉంటారు. సాయం పేరుతో కూడా స్కామ్‌లను కేవలం ఆర్మీ అధికారులనే టార్గెట్ చేసుకుంటున్నారు .జాతీయ విపత్తుల పేరుతో కూడా విరాళాలు స్కామ్‌లను ఆర్మీ అధికారులనే టార్గెట్ చేసుకుంటున్నారు. 

ఆర్థిక మోసాల నుంచి రక్షణ ఇలా

  • కాల్‌లు, ఈ-మెయిల్‌లు, టెక్స్ట్‌లు లేదా వాట్సాప్ సందేశాల ద్వారా ఏవైనా ఆఫర్లు వస్తే వెంటేనే స్పందించకూడదు. 
  • బయట ఎక్కడైనా ఆధార్ ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్ ఆధార్ ఇవ్వడం ఉత్తమం. 
  • వ్యక్తిగత పత్రాల ఫోటోకాపీలను అందించేటప్పుడు వాటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి వాటి చెల్లుబాటు, ఉద్దేశాలను పేర్కొనడం మంచిది. 
  • ఎఫ్‌డీ రేటు కంటే ఎక్కువ హామీతో కూడిన రాబడికి సంబంధించిన ఏదైనా వాగ్దానాన్ని అనుమానంగానే చూడాలి. ఒకటి రెండు సార్లు నిపుణులను సంప్రదించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.
  • అలాగే స్థిరాస్థి అంటే భూమిని కొనుగోలు చేసేటప్పుడు టైటిల్‌ను ధ్రువీకరణ చాలా ముఖ్యం. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం