Money Tips: యుక్త వయస్సులోనే ఆ అవగాహన తప్పనిసరి.. డబ్బు పొదుపు నేర్చుకోవాల్సిందే..!

సాధారణంగా ఆర్థిక అక్షరాస్యత విషయంలో భారతీయులు ఇతర దేశస్తులతో పోల్చి చూస్తే కొంత వెనుబడే ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇంట్లోని పిల్లలకు చెప్పకూడదని కోరుకుంటూ ఉంటారు. తాము పడే కష్టం పిల్లలు పడకూడదని వారికి ఏ విషయం తెలియకుండా వారు కోరుకున్నది వారు ముందు పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం చాలా తప్పని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Money Tips: యుక్త వయస్సులోనే ఆ అవగాహన తప్పనిసరి.. డబ్బు పొదుపు నేర్చుకోవాల్సిందే..!
Savings Account
Follow us

|

Updated on: Aug 19, 2024 | 6:15 PM

సాధారణంగా ఆర్థిక అక్షరాస్యత విషయంలో భారతీయులు ఇతర దేశస్తులతో పోల్చి చూస్తే కొంత వెనుబడే ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇంట్లోని పిల్లలకు చెప్పకూడదని కోరుకుంటూ ఉంటారు. తాము పడే కష్టం పిల్లలు పడకూడదని వారికి ఏ విషయం తెలియకుండా వారు కోరుకున్నది వారు ముందు పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం చాలా తప్పని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యుక్త వయస్సులో వారికి తల్లిదండ్రుల కష్టం తెలిస్తేనే ఖర్చు పెట్టే సమయంలో జాగ్రత్త పడతారని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఆర్థిక విషయాల్లో అవగాహన కల్పించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

వ్యక్తిగత వ్యయం

యుక్త వయస్సులో ఉన్న విద్యార్థులు వ్యక్తిగత వ్యయం విషయంలో చాలా జాగ్రత్త పడాలి. కాలేజీలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు డబ్బు ఇస్తారు. ఆ డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుండా అవసరం మేర ఖర్చు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా చిన్న వయస్సు నుంచే ఆర్థిక క్రమ శిక్షణ అలవాటు అవుతుంది. 

ఇంటి ఖర్చులు

టీన్ ఏజ్‌లో విద్యార్థులకు ఇంటి ఖర్చులను చెప్పడం ద్వారా డబ్బు నిర్వహణ అనేది వారికి అలవాటు అవుతుంది. ముఖ్యంగా నెలవారీ ఖర్చులు, నిత్యావసరాల ఖర్చులతో ఇతర ఖర్చులను వారి ద్వారానే చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మొత్తం ఖర్చులను వారితో ఖర్చు పెట్టనివ్వకుండా పొదుపునకు సంబంధించి ప్రాముఖ్యతను తెలియజేయడం ఉత్తమం. ముఖ్యంగా నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయించడానికి వివిధ స్మార్ట్ ఫోన్స్ యాప్స్ ఉపయోగించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఇతర ఖర్చులు

విహారయాత్రలు, వినోదం, ఇతర కార్యకలాపాలపై వ్యయం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. కేవలం ఇంట్లో వాళ్లు ఇస్తున్నారని ఖర్చు చేయకుండా అవసరమైన మేరకు మాత్రమే ఖర్చు చేయాలి. చిన్ని చిన్ని సరదాలకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకుడదని నిపుణులు సూచిస్తున్నారు. 

పార్ట్ టైమ్ ఉద్యోగం

ఇంట్లోని అవసరాలను అర్థం చేసుకుని చదువుకునే సమయం నుంచే సంపాదన మార్గం వైపు వెళ్లడం చాలా మంచిది. ముఖ్యంగా పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా సంపాదించుకుంటే డబ్బు విలువ తెలుస్తుంది. వివిధ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా డెలివరీ బాయ్‌గా పని చేయడం, లేదా ఇంటి వద్ద ట్యూషన్స్ చెప్పడం ద్వారా యువత రోజువారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి