AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan: రాఖీ బహుమతితో మీ సోదరికి ఆర్థిక భరోసా.. ది బెస్ట్ పెట్టుబడి మార్గాలివే..!

ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. సోదరులపై ప్రేమతో సోదరి వారికి రాఖీ కడుతుంది. అయితే ఈ సమయంలో సోదరికి సోదరుడు కొంత సొమ్ము ఇవ్వడం పరిపాటి. సాధారణంగా సోదరుడు అంటే సోదరి భవిష్యత్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే వారు చెల్లిలి భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక భరోసానివ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ పథకాల్లో పెట్టుబడుల ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసాను ఇవ్వచ్చని సూచిస్తున్నారు

Raksha Bandhan: రాఖీ బహుమతితో మీ సోదరికి ఆర్థిక భరోసా.. ది బెస్ట్ పెట్టుబడి మార్గాలివే..!
Rakhi Festival
Nikhil
|

Updated on: Aug 19, 2024 | 5:45 PM

Share

ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి నెలకొంది. సోదరులపై ప్రేమతో సోదరి వారికి రాఖీ కడుతుంది. అయితే ఈ సమయంలో సోదరికి సోదరుడు కొంత సొమ్ము ఇవ్వడం పరిపాటి. సాధారణంగా సోదరుడు అంటే సోదరి భవిష్యత్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే వారు చెల్లిలి భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక భరోసానివ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ పథకాల్లో పెట్టుబడుల ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసాను ఇవ్వచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షాబంధన్ రోజున చెల్లెల్లకు ఎలాంటి పెట్టుబడి బహుమతులను ఇవ్వాలో? ఓ సారి తెలుసుకుందాం. 

బ్యాంక్ ఖాతా

మీరు మీ చెల్లెలి కోసం బ్యాంకు ఖాతా తీసుకుని అందులో డిపాజిట్ చేస్తే మీ చెల్లిలి అవసరాలకు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా తీసుకోవడం అంటే వారికి ఆర్థిక అక్షరాస్యత కల్పించడమే. బ్యాంకు ఖాతా గురించి తెలుసుకోవడంతో నిధుల బదిలీ గురించి ఓ కంట కనిపెట్టమని సూచించడం ద్వారా ఆర్థిక విషయాల్లో ప్రాథమిక అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఇటీవల మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టువచ్చు. ఈ పథకంలో పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఈ ఖాతా రెండేళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్

మీరు ధీర్ఘకాలం ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంటే మీ సోదరిపేరుపై మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి ఎస్ఐపీ ప్లాన్ తీసుకుని బహుమతిగా ఇవ్వవచ్చు. లేకపోతే మీ పేరుపై ఎస్ఐపీను ప్రారంభించి ఆపై మీ పేరు మీద నిర్వహించడం కానీ సోదరిని నామినీగా పెట్టవచ్చు. మీరు నెలకు కనీసం రూ. 500తో ప్రారంభించవచ్చు. 

ఇవి కూడా చదవండి

విద్య కోసం పెట్టుబడి

మీ సోదరి విద్య లేదా నైపుణ్యాభివృద్ధి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆమెకు పుస్తకాలు, ఈ-బుక్స్, లెర్నింగ్ సబ్‌స్క్రిప్షన్‌లను బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆమె ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపర్చవచ్చు. ముఖ్యంగా మీ చెల్లెలికి ఫైనాన్స్‌పై అవగాహన కల్పిస్తుంది. 

ఆరోగ్య బీమా

సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే పెరుగుతున్న వైద్య ఖర్చులను మీ చెల్లెలిని రక్షించనట్టుగా ఉంటుంది.  ముఖ్యంగా అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. చిన్న వయస్సులోనే ఆరోగ్య బీమా కవరేజీ ఇవ్వడం అంట ఒక సోదరుడు తన సోదరికి అందించగల అత్యుత్తమ రక్షణలలో ఇది ఒకటి అని నిపుణులు చెబుతున్నారు.

గోల్డ్ బాండ్స్

సాధారణంగా ఆడపిల్లకు బంగారం ఇవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కొనుగోలు చేసే కంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లేదా ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ బహుమతి ఇస్తే మీ సోదరి చాలా సంతోషిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి