UPI Scam: వెలుగులోకి నయా యూపీఐ స్కామ్.. రిక్వెస్ట్ పేరుతో బ్యాంకు ఖాతా ఖాళీ

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్ సేవలు అనతి కాలంలో ప్రజాదరణను పొందాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీ సిస్టమ్‌తో ఆన్‌లైన్ చెల్లింపులను చేసే అవకాశం ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ చెల్లింపును ఇష్టపడుతున్నారు. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లే యూపీఐ సేవల్లోని లొసుగులను ఉపయోగించుకుని కొంతమంది అకౌంట్స్‌లోని డబ్బు తస్కరిస్తున్నారు.

UPI Scam: వెలుగులోకి నయా యూపీఐ స్కామ్.. రిక్వెస్ట్ పేరుతో బ్యాంకు ఖాతా ఖాళీ
UPI
Follow us

|

Updated on: Aug 19, 2024 | 5:34 PM

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్ సేవలు అనతి కాలంలో ప్రజాదరణను పొందాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీ సిస్టమ్‌తో ఆన్‌లైన్ చెల్లింపులను చేసే అవకాశం ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ చెల్లింపును ఇష్టపడుతున్నారు. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లే యూపీఐ సేవల్లోని లొసుగులను ఉపయోగించుకుని కొంతమంది అకౌంట్స్‌లోని డబ్బు తస్కరిస్తున్నారు. ముఖ్యంగా స్కామర్‌లు ఆటో పే రిక్వెస్ట్ ద్వారా యూపీఐ యూజర్ల నుంచి సొమ్మును కాజేస్తున్నారు. ఈ రిక్వెస్ట్‌లను ఏమరుపాటుగా ఆమోదిస్తే మీ ఖాతాలోని సొమ్ము మాయం అవుతుంది. యూపీఐ కలెక్ట్ మనీ ఫ్రాడ్‌గా పేర్కొంటున్న ఈ తాజా యూపీఐ స్వామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

యూపీఐ కలెక్ట్ మనీ స్కామ్ ఒక సాధారణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. గతంలో యూపీఐ రిక్వెస్ట్ ద్వారా సొమ్ము కాజేసే కేటుగాళ్లు ఇప్పుడు పేటీఎం, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పేరుతో దోచేస్తున్నారు. ముఖ్యంగా పే రిక్వెస్ట్ పేటీఎం, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే నోటిఫికేషన్ పంపాయనుకునేలా ఆటో పే రిక్వెస్ట్‌ను పంపుతున్నారు. అయితే ఏది నిజమైన రిక్వెస్ట్‌, ఏది మోసపూరిత రిక్వెస్ట్ అనేది తెలియక వినియోగదారులు మోసానికి గురవుతున్నారు. పొరపాటున మీరు ఈ అభ్యర్థనను మీ సొంత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అని భావించి ఆమోదిస్తే మీ ఖాతా నుంచి సొమ్ము ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు యూపీఐ ఐడీలను మెరుగ్గా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూపీఐ ఐడీలు ఎక్కడా డిస్‌ప్లే కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

యూపీఐ ఐడీలు సాధారణంగా యూపీఐ ప్రొవైడర్ పొడిగింపుతో ఫోన్ నంబర్‌ చివరన @  యూపీఐ ప్రొవైడర్ ఐడీతో వస్తాయి. ఇలా సింపుల్‌గా కనుగొనేలా యూపీఐ ఐడీలు ఉండడం వల్ల స్కామర్లు ఈజీగా ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే షాపింగ్, రెస్టారెంట్లు, మాల్స్, పార్కింగ్ ప్లేస్‌ల వంటి ప్రాంతాల్లో యూపీఐ ఐడీలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యూపీఐ ఐడీలు తెలుసుకున్న స్కామర్లు ఆటో పే రిక్వెస్ట్ ద్వారా డబ్బును తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగదారులు చాలా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆటో పే రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకుండా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం