Donald Trump: త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? త్వరలో కొత్త విధానం
Donald Trump: వీసా ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయాలు ప్రస్తుతం దేశాన్ని బట్టి చాలా నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటాయి. ప్రీమియం వ్యవస్థ అన్ని దరఖాస్తుదారులకు క్యూను తగ్గించకపోయినా, వేగవంతమైన ఇంటర్వ్యూలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టిస్తుంది. ప్రామాణిక..

త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? అయితే 1000 డాలర్లు చెల్లిచాల్సిందే మరి? కొత్త విధానం అమల్లో తీసుకురాబోతున్నారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఒక ప్రత్యేక విధానాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోంది. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా 1,000 డాలర్లు చెల్లిస్తే, వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అతి త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఇది ప్రస్తుత వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూ ప్రక్రియల్లో ఎటువంటి మార్పును చేయబోదు. కేవలం సుదీర్ఘకాల నిరీక్షణను మాత్రమే తప్పిస్తుందని మెమోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం పర్యాటకులు, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్‌ఫీజు కింద 185 డాలర్లను చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్‌ను ఏర్పాటుచేస్తున్నారు. 50 లక్షల యూఎస్ డాలర్లు చెల్లిస్తే పౌరసత్వం ఇస్తామంటూ ప్రవేశపెట్టిన ‘గోల్డ్ కార్డు’ పథకం ప్రకటించేనాటికి వీసా ప్రీమియం సేవల ఆలోచన తెరపైకి రాలేదు. 1,000 యూఎస్ డాలర్లు అంటే సుమారుగా రూ.86,000 చెల్లించాలి. అయితే ఇది అమలులోకి వస్తే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురుకావచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ న్యాయవాదుల్లోనే వ్యక్తమయింది.
వీసా ఇంటర్వ్యూల కోసం వేచి ఉండే సమయాలు ప్రస్తుతం దేశాన్ని బట్టి చాలా నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటాయి. ప్రీమియం వ్యవస్థ అన్ని దరఖాస్తుదారులకు క్యూను తగ్గించకపోయినా, వేగవంతమైన ఇంటర్వ్యూలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టిస్తుంది. ప్రామాణిక $185 తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుముతో పాటు $1,000 ప్రీమియం వసూలు చేయబడుతుంది.
ఇది కూడా చదవండి: Britannia Biscuits: ఇక బ్రిటానియా బిస్కెట్ల తయారీ ఫ్యాక్టరీ మూతపడనుందా? కారణం ఏంటి?
ఇది కూడా చదవండి: World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు.. ఎలాంటి యూ-టర్న్ లేకుండా 14 దేశాల గుండా..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




