AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు.. ఎలాంటి యూ-టర్న్‌ లేకుండా 14 దేశాల గుండా..

World’s Longest Road: ఈ రోడ్డులో ఎక్కువ భాగం స్పానిష్ మాట్లాడే దేశాల గుండా వెళుతుంది కాబట్టి, దానిపై ప్రయాణించే ప్రజలు కమ్యూనికేట్ చేయడంలో ఎటువంటి సమస్య ఉండకుండా ప్రాథమిక స్పానిష్ నేర్చుకోవాలని సూచించారు. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పాన్-అమెరికన్ హైవే నిర్మాణం..

World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు.. ఎలాంటి యూ-టర్న్‌ లేకుండా 14 దేశాల గుండా..
Subhash Goud
|

Updated on: Jun 05, 2025 | 12:12 PM

Share

World’s Longest Road: ప్రపంచంలోనే అతి పొడవైన, ఎలాంటి యూటర్న్‌ లేకుండా నిటారుగా ఉండే రోడ్డు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ రోడ్డు చాలా పొడవుగా ఉండటం వల్ల ఎవరైనా ప్రతిరోజూ 500 కిలోమీటర్లు నడిచినా, దానిని పూర్తిగా దాటడానికి 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ రోడ్డు గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఎటువంటి యు-టర్న్ లేకుండా 14 దేశాల గుండా నేరుగా వెళుతుంది.

ఆ రోడ్డు పేరు పాన్-అమెరికన్ హైవే. ఇది ఉత్తర, దక్షిణ అమెరికాలోని మొత్తం 14 దేశాల గుండా వెళుతుంది. ఇందులో మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా వంటి ఉత్తర అమెరికా దేశాలు ఉన్నాయి. దీనితో పాటు, ఈ రోడ్డు కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనా వంటి దక్షిణ అమెరికా దేశాల గుండా కూడా వెళుతుంది.

ఇది కూడా చదవండి: Auto Driver: డబ్బులు ఊరికే రావు.. ఆటో డ్రైవర్‌ ఐడియా అదిరింది.. నెలకు రూ.8 లక్షల సంపాదన

ఇవి కూడా చదవండి

30,000 కిలోమీటర్ల పొడవు:

ఈ రోడ్డు పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. అలాగే ఇది అలాస్కాలోని “ప్రుధో బే” అనే ప్రదేశం నుండి ప్రారంభమవుతుంది. ఎలాంటి యూర్న్‌ లేకుండా పాన్-అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యింది. ఇది వివిధ రకాల వాతావరణం, పర్యావరణం గుండా వెళుతుంది. దారిలో దట్టమైన అడవుల నుండి పొడి ఎడారుల వరకు ఉన్నాయి. ఈ రోడ్డు పొడవుగా ఉండటమే కాకుండా చూడదగ్గదిగా ఉండటానికి ఇదే కారణం.

ఈ రోడ్డు కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, అనేక ఎంపికలతో కూడిన నెట్‌వర్క్ లాంటిది. అమెరికా, కెనడా, మెక్సికో వంటి పెద్ద దేశాల మధ్య కమ్యూనికేషన్‌కు ఇది అతిపెద్ద మార్గం. దీనిపై ప్రయాణించే వారు వివిధ రకాల వాతావరణ, భౌగోళిక వైవిధ్యాన్ని చూస్తారు. ఈ రోడ్డు పర్యాటకులు, ప్రయాణ ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ ప్రయాణం 60 రోజుల్లో పూర్తి:

నివేదికల ప్రకారం, ఈ మొత్తం హైవే ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుందట. కానీ ఈ సమయం వాహనం వేగం, ప్రయాణికులు ఎక్కడ ఆగుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, కార్లోస్ శాంటామారియా అనే ప్రయాణికుడు ఈ మొత్తం ప్రయాణాన్ని 117 రోజుల్లో పూర్తి చేశాడు.

ఈ రోడ్డులో ఎక్కువ భాగం స్పానిష్ మాట్లాడే దేశాల గుండా వెళుతుంది కాబట్టి, దానిపై ప్రయాణించే ప్రజలు కమ్యూనికేట్ చేయడంలో ఎటువంటి సమస్య ఉండకుండా ప్రాథమిక స్పానిష్ నేర్చుకోవాలని సూచించారు. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పాన్-అమెరికన్ హైవే నిర్మాణం 1920ల ప్రారంభంలో ప్రారంభమైంది. 1937లో 14 దేశాలు ఈ రహదారిని నిర్మించడానికి, నిర్వహించడానికి అంగీకరించాయి. అలాగే చివరికి ఇది 1960లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్‌.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్‌ టికెట్స్‌ బుక్‌ చేయలేరు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి