Trump-Musk: మాటల యుద్ధం.. ట్రంప్‌పై మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
Trump-Musk: ఎలక్ట్రిక్ వాహన విధానాలు, పన్ను బిల్లుకు సంబంధించి ట్రంప్ -మస్క్ గత కొన్ని రోజులుగా తీవ్ర బహిరంగ చర్చ జరుపుతున్న సమయంలో ఈ పోస్ట్‌లు చేసారు. గురువారం ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ వంటి కంపెనీల ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తామని..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య చెడిందనే వార్తలు గుప్పమంటున్నా.. వేళ ఓ బిల్లు విషయమై ట్రంప్‌పై మస్క్ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు కూడా బద్ద శతృవులుగా మారిపోయారు. ఇద్దరి మధ్య వివాదం ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. మాటల యుద్ధం ఎంత స్థాయికి చేరుకుందంటే, ట్రంప్ ఎన్నికల్లో గెలుస్తారని ప్రకటించిన తర్వాత, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్ స్థానంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ను అమెరికా కొత్త అధ్యక్షుడిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా, ట్రంప్- మస్క్ మధ్య చాలా విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మస్క్ ట్విట్టర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నిజమైన బాంబు వేయాల్సిన సమయం ఆసన్నమైందని మస్క్ X లో రాశాడు. ఎప్‌స్టీన్ ఫైళ్లలో డోనాల్డ్ ట్రంప్ పేరు నమోదు చేసి ఉందని, అందుకే ఈ ఫైళ్లను ఎప్పుడూ బహిరంగపరచలేదని అన్నారు. దీని తర్వాత, డోనాల్డ్ ట్రంప్, మీకు మంచి రోజు శుభాకాంక్షలు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
ఎలోన్ మస్క్ పై ఎదురుదాడి చేస్తూ, మస్క్ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మారాడనే విషయం నాకు పట్టింపు లేదని ట్రంప్ అన్నారు. కానీ ఆయన దీన్ని ముందుగానే చేసి ఉండాల్సింది. కాంగ్రెస్ ముందు సమర్పించిన బిల్లులలో ఇదే అత్యంత ముఖ్యమైన బిల్లు అని ఆయన అన్నారు. ఇందులో 1.6 ట్రిలియన్ డాలర్ల వ్యయం తగ్గించబడింది. ఇందులో చరిత్రలో అతిపెద్ద పన్ను కోత విధించింది.
ఈ బిల్లు ఆమోదం పొందకపోతే పన్నులు 68 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. నేను ఈ తప్పు చేయలేదు, దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని అధ్యక్షుడు అన్నారు. ఈ బిల్లు అమెరికాను మరింత గొప్పగా చేస్తుందని అన్నారు.
ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేస్తామని బెదిరింపు:
ఎలక్ట్రిక్ వాహన విధానాలు, పన్ను బిల్లుకు సంబంధించి ట్రంప్ -మస్క్ గత కొన్ని రోజులుగా తీవ్ర బహిరంగ చర్చ జరుపుతున్న సమయంలో ఈ పోస్ట్‌లు చేసారు. గురువారం ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ వంటి కంపెనీల ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తామని ట్రంప్ బెదిరించారు. ఆర్థిక నష్టాలను ఉదహరిస్తూ, బడ్జెట్‌ను తగ్గించడానికి సులభమైన మార్గం మస్క్ కంపెనీలకు ఇచ్చే బిలియన్ డాలర్ల సబ్సిడీని ముగించడమేనని ట్రంప్ అన్నారు.
Elon Musk tweets, “Time to drop the really big bomb: Donald Trump is in the Epstein files. That is the real reason they have not been made public.” pic.twitter.com/Z6kTkijJwz
— ANI (@ANI) June 5, 2025
ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి?
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక బిలియనీర్, అపఖ్యాతి పాలైన ఫైనాన్షియర్, అతను మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన అభియోగాలు మోపబడ్డాడు. అదే సమయంలో 2019లో ఎప్స్టీన్ అరెస్టు తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో జైలులో మరణించాడు. ఇప్పుడు జెఫ్రీ కాంటాక్ట్ లిస్ట్‌ను ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తారు. దీనిని కోర్టు చాలా కాలంగా మూసివేసింది. ఎప్‌స్టీన్ క్లయింట్ జాబితా గురించి, అంటే అతని హై-ప్రొఫైల్ కస్టమర్ల జాబితా గురించి అమెరికాలో నిరంతరం చర్చ జరుగుతోంది. ఈ ఫైళ్లలో డజన్ల కొద్దీ ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయని చెబుతారు. వీరిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ తారలు కూడా ఉండవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




