Trujet Offer: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ప్రకటించిన ట్రూజెట్.. విమాన టికెట్ ధర ఎంతంటే..
Trujet Offer: భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్..
Trujet Offer: భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన ప్రయాణికులకు దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. డోమేస్టిక్ ప్రయాణ టికెట్‌ను రూ. 926కే ఆఫర్ చేస్తోంది. ఈ టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభం అవగా.. జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ట్రూజెట్ సంస్థ తెలిపింది. అయితే, రూ. 926 రేట్‌కు ట్యాక్స్‌లు అదనమని ట్రూజెట్ స్పష్టం చేసింది.
ఈ మేరకు ట్రూజెట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ఆఫర్ సమయంలో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ట్రూజెట్ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Also read:
NEET Exam: ‘నీట్’పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం.. అభ్యర్థులకు ఉరట కలిగేనా..?
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మధ్య సమన్వయం పెరగాలి.. అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్