సరికొత్త రికార్డు సొంతం చేసుకున్న భారత రైల్వే.. పట్టాలపై పరుగులు పెట్టిన అత్యంత పొడవైన గూడ్స్ రైలు
భారతీయ రైల్వే సంస్థ మరోసారి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తక్కువ సమయంలో ఎక్కువ సరుకులు రవాణా చేసిన వాసుకి గూడ్స్ రైలు.
Longest Freight Train vasuki : భారతీయ రైల్వే సంస్థ మరోసారి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించింది. ‘వాసుకి’ అని భారతీయ రైల్వే పేరు పేట్టింది. ఈ సరుకు రవాణా వాసుకి రైలును ఛత్తీస్‌గడ్‌లోని భిలై నుంచి కోర్బా వరకు నడుపుతూ భారతీయ రైల్వే ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య సుమారు 224 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఐదు రైళ్లను అనుసంధానించిన తరువాత ఈ రైలు పొడవు 3.5 కిలోమీటర్ల అని రైల్వ అధికారులు తెలిపారు.
భారతీయ రైల్వే ఈ ఘనత సాధించినందుకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్ వేదికగా ప్రశంసించారు. పారిశ్రామిక ఉత్పత్తులను అధికంగా మొత్తంలో పంపిణీ చేయడంతో పాటు సరుకు రవాణా రంగంలో కీలక మార్పులను ఈ రైలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనిని ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సహాయంతో నడిపినట్లు ఆయన వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ సరుకులు రవాణా చేసేందుకే ఈ వాసుకి’ని చేపట్టినట్లు చెప్పారు.
Longest hauling! Recently, @secrail hauled 3.5 Km freight train, Vasuki, towing 295 wagons, from #Bhilai to #Korba#PhotoOfTheDay #freight #railways #India #IndianRailways #Chhattisgarh pic.twitter.com/WMKYdWy8G1
— South Western Railway (@SWRRLY) January 23, 2021
ఇదిలావుంటే, గతంలోనూ భారీ గూడ్స్ రైలును నడిపి రికార్డు సృష్టించింది భారత రైల్వే. తాజా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ వాసికి ప్రవేశపెట్టింది. గతంలో 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి నడిపింది. దీనికి ‘సూపర్ అనకొండ’ అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్‌పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది.
Read Also.. రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయన్న ఢిల్లీ పోలీసులు.!