Gold and Silver Rates : బంగారం ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగివచ్చిన పసిడి ధరలు.. అదేదారిలో వెండి

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర కాస్త దిగొచ్చింది.

Gold and Silver Rates : బంగారం ప్రియులకు శుభవార్త.. మరోసారి దిగివచ్చిన పసిడి ధరలు.. అదేదారిలో వెండి
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 25, 2021 | 9:55 AM

Today Gold and Silver rates : మరోసారి దేశంలో పసిడి ధరల కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్స్ ధర తగ్గడం కారణంగా పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.45,940కు చేరుకుంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించి.. రూ.50,740కు చేరుకుంది.

బంగారం ధర తగ్గడంతో అదేదారిలో వెండి ధర కూడా పయనించింది. కేజీ వెండి రూ.100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.71,300కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1,855 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 25.65 డాలర్లకు చేరింది.

Read Also… పంచాయతీ ఎన్నికలపై ఇంకా అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు పైన అందరి దృష్టి పడింది.