AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kratos e-bike: భారత మార్కెట్​లోకి మరో ఎలక్ట్రిక్ బైక్, వావ్ అనేలా ఫీచర్లు.. మార్చి నుంచి టెస్ట్ డ్రైవ్..

ఇదే క్రమంలో టోర్క్ మోటార్స్ తన కొత్త టోర్క్ క్రటోస్ ఎక్స్(Tork Kratos X ) అనే ఎలక్ట్రిక్ బైక్‌ని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ బైక్ వివరాలు తెలుసుకుందాం..

Kratos e-bike: భారత మార్కెట్​లోకి మరో ఎలక్ట్రిక్ బైక్, వావ్ అనేలా ఫీచర్లు.. మార్చి నుంచి టెస్ట్ డ్రైవ్..
Kratos X
Madhu
| Edited By: |

Updated on: Jan 12, 2023 | 6:57 PM

Share

ప్రస్తుతం మార్కెట్ లో ఏదైనా కొత్తగా వాహనం లాంచ్ అయ్యింది అంటే ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ దే అయి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ అదే కనుక అన్ని కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వేరియంట్లలోనే విడుదల చేస్తున్నాయి. కార్లు, బైక్ లు ఈ జాబితాలో అధికంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో టోర్క్ మోటార్స్ తన కొత్త టోర్క్ క్రటోస్ ఎక్స్(Tork Kratos X ) అనే ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ని ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ బైక్ వివరాలు తెలుసుకుందాం..

జూన్ నుంచి డెలివరీలు..

ఈ క్రటోస్ ఎక్స్ బైక్ Kratos R డిజైన్ ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్, FF మోడ్, కొత్త అల్యూమినియం స్వింగ్‌ ఆర్మ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో కస్టమర్ టెస్ట్ రైడ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్లు ఇవే..

కొత్త Tork Kratos X సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, నావిగేషన్‌ సదుపాయం కలిగి ఉంది. డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంటేషన్ తో పాటు ఈ బైక్‌లో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గతేడాది రెండు మోడళ్లు..

టోర్క్ మోటార్స్ గత సంవత్సరం భారతదేశంలో టోర్క్ క్రటోస్ పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. రెండు మోడళ్లను విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ టోర్క్ క్రటోస్ రూ. 1.08 లక్షలు, క్రటోస్ ఆర్ రూ. 1.23 లక్షలకు (ఎక్స్-షోరూమ్, పూణే) విక్రయిస్తున్నారు.

  • ప్రామాణిక క్రటోస్ మోడల్ 10 bhp, 28 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 7.5 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. అలాగే గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 4 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 120 కిమీ మైలేజీ వస్తుంది.
  • అదే Tork Kratos R వేరియంట్ అయితే 12 bhp, 38 Nm టార్క్ అభివృద్ధి చేసే 9 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 105 కిమీ. నాలుగు సెకన్లలో 0-40 కిమీ వేగం అందుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!