Gold Price: మహిళలకు షాక్.. కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Today Gold Rate: ఈ రోజుల్లో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలో బంగారంపై పెట్టుబడి కూడా పెరిగింది. చైనా కేంద్ర బ్యాంకు కూడా నిరంతరం బంగారాన్ని సేకరిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాని..

Today Gold Rate: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. పదుల సంఖ్యతో తగ్గి వేల సంఖ్యలో పెరుగుతోంది. అప్పుడే తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా దూసుకుపోతోంది. కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా పెరిగింది. శనివారం తులం బంగారంపై ఏకంగా 1,092 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుత సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620 రూపాయలకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 18 గ్రాముల పసిడి ధర 76,214 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే నేనెందుకు తగ్గాలే అన్నట్లుగా కిలోపై ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో సిల్వర్ ధర 1,20,000 ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో అయితే కిలో వెండి 1,30,000 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ
మీరు బంగారం కొనబోతున్నట్లయితే ముందుగా దాని తాజా ధర తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం మీరు మీ నగరంలోని అనేక దుకాణాలను సందర్శించి విచారించవచ్చు లేదా మీరు నేరుగా ఆభరణాల వ్యాపారులకు కాల్ చేసి తాజా సమాచారాన్ని పొందవచ్చు.
ఈ రోజుల్లో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు బంగారాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లలో బంగారంపై పెట్టుబడి కూడా పెరిగింది. చైనా కేంద్ర బ్యాంకు కూడా నిరంతరం బంగారాన్ని సేకరిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్, ధరను పెంచింది. దీనితో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అవకాశం కూడా బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది. ఈ కారణంగానే నేడు బంగారం పెట్టుబడిదారుల మొదటి ఎంపికగా మారింది.
School Holidays: భారీ వర్షాలు.. 10 జిల్లాల్లో పాఠశాలలు బంద్.. ఆ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








