బిగ్ బ్రేకింగ్ న్యూస్: 46 వేలకు చేరుకున్న బంగారం!

పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చాయి గోల్డ్ ధరలు. వరుసగా మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఒకేసారి పెరిగి కొనుగోలుదారుల ఆశలు అడియాశలు..

బిగ్ బ్రేకింగ్ న్యూస్: 46 వేలకు చేరుకున్న బంగారం!
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 6:49 PM

పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చాయి గోల్డ్ ధరలు. వరుసగా మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు.. ఇప్పుడు ఒకేసారి పెరిగి కొనుగోలుదారుల ఆశలు అడియాశలు చేసింది. గత కొద్ది రోజులుగా 45వేలు దాటుతుందని అందరూ అంచనా వేసినా.. శుక్రవారం బంగారం ధరలు మళ్లీ పెరిగి రికార్డు బ్రేక్ చేసింది. ఏకంగా ఒకేసారి రూ.1500లు పెరిగి రూ.46వేలకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తుంటే.. మరి కొద్ది రోజుల్లోనే.. 50 వేల బెంజ్ మార్క్ దాటుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా.. హైదరాబాద్‌లోని మార్కెట్‌ ధరలను బట్టి ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990లు కాగా.. 22 క్యారెట్ల ఆభరణాల ధర రూ. 42,310లుగా ఉంది. అటు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోనూ బంగారం ధర భారీగానే పెరిగింది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.773 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,343కి చేరుకుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రూ.1,678 డాలర్లుగా ఉంది. అయితే ఇంటర్నేషనల్‌గా రూపాయి విలువ పడిపోవడం, కరోనా దెబ్బ రెండూ అంశాలతో గోల్డ్ రేటు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కానీ.. ప్రస్తుతం ఈ ధర వింటుంటూనే.. బంగారు ప్రియుల గుండె గుభేలమంటోంది. అందులోనూ ఇప్పుడు పెళ్లిళ్ల ముహుర్తాలు ముమ్మరంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. బంగారం చూడటానికే తప్ప.. కొనేలా కనిపించడం లేదు. అలాగే బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.51,000లుగా ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు హ్యాపీ న్యూస్.. అక్కడ కరోనా లేదట!

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!