వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి అదనపు భారం తప్పదు!

వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి వారికి బీమా రూపంలో అదనపు భారం పడే అవకాశం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రకారం.. బీమా ప్రీమియం రేట్లలో గణనీయమైన పెరుగుదల..

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి అదనపు భారం తప్పదు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2020 | 4:13 PM

వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక నుంచి వారికి బీమా రూపంలో అదనపు భారం పడే అవకాశం నెలకొంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రకారం.. బీమా ప్రీమియం రేట్లలో గణనీయమైన పెరుగుదలను ప్రతిపాదించింది. మార్చి 5, 2020న ఐఆర్డీఏఐ విడుదల చేసిన దానిప్రకారం.. బస్సులు, టాక్సీలు, ట్రక్కులు వంటి రవాణా వాహనాలతో పాటు బైకులు, కార్లు వంటి వాహనాలకు కూడా తృతీయ పక్ష(థర్డ్ పార్టీ) బీమా పెంచాలని ఆ సంస్థ భావిస్తోంది.

ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలను మోసే ఎలక్ట్రిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను తీసుకెళ్లేందుకు 15 శాతాన్ని తగ్గించారు. ఇది కాకుండా, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మోటారు థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లపై 7.5 శాతం తగ్గింపును కూడా ప్రతిపాదించారు. అలాగే.. 1000 సీసీ వాహనాలకు రూ.2182, 1500 సీసీలోపు వాహనాలకు రూ.3,383, 75 సీసీలోపు వాహనాలకు రూ.506, 350సీసీ పైబడిన వాహనాలకు రూ.2,571 ప్రీమియాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వసూలు చేయాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది.

ఇది కూడా చదవండి: ఇక నుంచి ఏపీ స్కూల్స్‌లో ఇంగ్లీషు సినిమాలు.. ఎందుకంటే?