సంక్షోభంలో యెస్ బ్యాంక్..విత్ డ్రాలపై ఆంక్షలు.. ఆందోళనలో కస్టమర్లు..!

యెస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. గతకొద్ది రోజుల నుంచి ఈ బ్యాంకు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో యెస్ బ్యాంకు పనితీరుపై.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం యెస్ బ్యాంకు సంక్షోభంలో మునిగిపోయిందని పేర్కొనడంతో.. ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. యెస్ బ్యాంకు కస్టమర్లంతా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు. అయితే కస్టమర్లంతా అకౌంట్లో ఉన్న […]

సంక్షోభంలో యెస్ బ్యాంక్..విత్ డ్రాలపై ఆంక్షలు.. ఆందోళనలో కస్టమర్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2020 | 12:41 PM

యెస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. గతకొద్ది రోజుల నుంచి ఈ బ్యాంకు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో యెస్ బ్యాంకు పనితీరుపై.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం యెస్ బ్యాంకు సంక్షోభంలో మునిగిపోయిందని పేర్కొనడంతో.. ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. యెస్ బ్యాంకు కస్టమర్లంతా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు. అయితే కస్టమర్లంతా అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేస్తుండటంతో.. ఆర్బీఐ పలు షరతులను విధించింది.

అకౌంట్ హోల్డర్లు అంతా ఒకే సారి డబ్బులు విత్ డ్రా చేస్తే.. మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. క్యాష్ విత్ డ్రాపై ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్క అకౌంట్ హోల్డర్.. కేవలం రూ. 50 వేలు వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా షరతులు విధించింది. అంతకు మించి విత్ డ్రా చేయాలనుకునే కస్టమర్.. తప్పనిసరిగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యెస్ బ్యాంక్‌లో ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్ కస్టమర్లందరికీ ఈ కండిషన్స్ వర్తిస్తాయన ఆర్బీఐ తెలిపింది.

యెస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ సస్పెండ్ చేయడంతో.. కస్టమర్లలో ఆందోళన రెట్టింపయ్యింది. ఈ బ్యాంకు నుంచి ఇక మీదట ఎలాంటి లోన్లు, రెన్యూవల్ చేయడం.. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టేందుకు కుదరదు. కస్టమర్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నసమయంలో.. అనారోగ్యం, వివాహాల వంటి సమయాల్లో మాత్రమే కస్టమర్లకు రూ.5లక్షల వరకు ఇచ్చేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. బ్యాంకు డిపాజిటర్లకు రిజర్వ్ బ్యాంకు పూర్తిస్థాయి నమ్మకాన్నిస్తుంది.

పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
పదివేల ధరలోనే బెస్ట్ 5జీ ఫోన్లు.. మీరు నమ్మకున్నా ఇది నిజం
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
మకర సంక్రాంతి రోజు ఈ తప్పులు చేయవద్దు.. భారీ నష్టం కలుగుతుంది..
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి ఇన్ని ఉపయోగాలా?
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
ఈతరం తల్లిదండ్రులకు సుధామూర్తి పేరెంటింగ్ చిట్కాలు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
కారు కొంచెం.. సామర్థ్యం ఘనం.. మంచుకొండల్లో మారుతీ ఆల్టో దూకుడు
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఒక్క వేపాకుతోనే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
వాస్తు పరంగా మీ ఇళ్లు ఇలా ఉంటే ఆర్థికంగా ఢోకా ఉండదు..!
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది..
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
కొత్త బడ్జెట్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం.. నిపుణుల విశ్లేషణలివే
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో
మహాకుంభకు వెళ్తున్నారా మీ బడ్జెట్ లో బస చేసే హోటల్స్ లిస్టు ఇదిగో