Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే

బంగారం కొనేవారికి శుభవార్త. ఇటీవల పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు ఇవాళ (డిసెంబర్‌ 24) కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.550 నుంచి రూ.600 తగ్గింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్ల వివరాలివే
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2022 | 6:25 AM

బంగారం కొనేవారికి శుభవార్త. ఇటీవల పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు ఇవాళ (డిసెంబర్‌ 24) కాస్త తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.550 నుంచి రూ.600 తగ్గింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,700కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,220గా ఉంది. ఇక కొత్త ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 70,100 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,220 పలుకుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220 కులభిస్తోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,270 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,290వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,380 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,820 ఉంది.

వెండి ధరలిలా..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చైన్నైలో కిలో వెండి ధర రూ.73,700, ముంబైలో రూ.70,100, ఢిల్లీలో రూ.70,100, హైదరాబాద్‌లో రూ.73,700, కోల్‌కతాలో రూ.73,700, బెంగళూరులో రూ.73,700, విజయవాడలో రూ.73,700 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..