Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నల్ల ధనం’ మారిపోయిందా..? నోట్లరద్దుకు మూడేళ్లు..!

పాతనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు పూర్తయింది. వెయ్యి.. 500 నోట్లను రద్దు చేసి.. కొత్తగా 2 వేల నోటును తెరపైకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయడానికి మోదీ సర్కారు ప్రధానంగా రెండు కారణాలు చె ప్పింది. నల్లధనాన్ని వెలికి తీయటం, డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరీ ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరాయి..? ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల జీవితాలపై డీమోనిటైజేషన్‌ చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్‌ ఎఫెక్ట్స్‌ పూర్తిగా బయటపడినట్లేనా..? 2016 […]

'నల్ల ధనం' మారిపోయిందా..? నోట్లరద్దుకు మూడేళ్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 08, 2019 | 11:12 AM

పాతనోట్లను రద్దు చేసి ఇవ్వాల్టికి మూడేళ్లు పూర్తయింది. వెయ్యి.. 500 నోట్లను రద్దు చేసి.. కొత్తగా 2 వేల నోటును తెరపైకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయడానికి మోదీ సర్కారు ప్రధానంగా రెండు కారణాలు చె ప్పింది. నల్లధనాన్ని వెలికి తీయటం, డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహించడం. మరీ ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరాయి..? ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల జీవితాలపై డీమోనిటైజేషన్‌ చూపిన ప్రభావమెంత? నోట్ల రద్దు సైడ్‌ ఎఫెక్ట్స్‌ పూర్తిగా బయటపడినట్లేనా..?

2016 నవంబర్‌ 8న.. రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోదీ…ఆ రోజు అర్ధరాత్రి నుంచి వెయ్యి… 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు ఊహించని షాక్‌. జేబులోని నగదుతో పాటు.. అవసరాల కోసం ఇంట్లో పెట్టుకున్న డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చింది. చేతిలో ఉన్న డబ్బును బ్యాంకులో వేసేస్తే తర్వాతెప్పుడైనా తీసుకోవచ్చనే ఉద్దేశంతో జనాలు బారులు తీరారు. ఇక ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే డబ్బుపై పరిమితులు విధించడంతో.. ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. అప్పట్లో నగదు కోసం జనం పడినపాట్లు అన్నీ ఇన్నీకావు. గంటల తరబడి ఏటీఎంల దగ్గర నిలబడి ప్రజలు డబ్బులు డ్రా చేసుకున్నారు. కొత్తగా వచ్చిన 2 వేల నోటుకు చిల్లర లేక ఇబ్బందిపడ్డారు.

నల్లధనంపై పోరుపేరుతో మోదీ సర్కార్‌ ప్రయోగించిన నోట్ల రద్దు అస్త్రం విఫలం కావటమే కాక.. దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిందన్న ఆరోపణలూ ఉన్నాయి. RBI ముద్రించిన నగదులో నిర్దిష్ట మొత్తం.. లెక్కలు చెప్పని బ్లాక్‌మనీ రూపంలో పన్ను ఎగవేతదారుల వద్ద ఉందన్న అంచనాలతో సర్కార్‌ నోట్ల రద్దు ప్రకటించింది. నోట్ల రద్దు తొలి ఏడాదినే తరువాత నుంచే పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ.. ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. RBI 2018 నాటి రిపోర్టు ప్రకారం రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు. వీటినీ దాచేయటం పెరిగి.. చలామణీ తగ్గిపోతుండటంతో ఈ నోట్ల ముద్రణను ఇటీవల నిలిపేసినట్లు సమాచారం.

నోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలు పుంజుకున్నాయనేది నిజం. పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, యూపీఐ వంటివి బాగా వాడకంలోకి వచ్చాయి. RBI, NPCI రిపోర్టు ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. 2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మెషీన్లలో డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు… మొబైల్‌ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.