నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..?

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.77.26 కాగా.. డీజిల్ లీటర్ రూ.71.75గా ఉంది. అలాగే.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50 కాగా.. డీజిల్ లీటర్ ధర రూ.69.50గా ఉంది. ఇక ఢిల్లీలో అతి తక్కువగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.60 కాగా.. లీటర్ […]

నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 08, 2019 | 7:59 AM

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.77.26 కాగా.. డీజిల్ లీటర్ రూ.71.75గా ఉంది. అలాగే.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50 కాగా.. డీజిల్ లీటర్ ధర రూ.69.50గా ఉంది. ఇక ఢిల్లీలో అతి తక్కువగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.60 కాగా.. లీటర్ డీజిల్ రూ.65.75గా ఉంది. అయితే.. అక్టోబర్ నెలతో పోల్చితే.. ఇందనం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. దాదాపు 3 రూపాయలు తేడా కనిపిస్తుంది.

అందుకు కారణాలేంటంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అందువల్ల ఇందనం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. కాగా.. అలాగే.. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయి.

అక్టోబర్ నెలలో పెట్రోల్‌ ధరలు హయ్యెస్ట్ రికార్డును దాటాయి. అప్పుడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.25గా నమోదయ్యింది. ఇక డీజిల్ లీటర్ ధర రూ.73.52గా ఉంది. దీంతో పోల్చితే.. ఇప్పుడు ఇందనం ధరలు కాస్త తగ్గాయనే చెప్పవచ్చు. దుబాయ్‌లో పెట్రోల్ బావులపై దాడి కారణంగా.. భవిష్యత్తులో ఇందనం ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నా.. అందుకు విరుద్ధంగా ధరలు తగ్గుతూ వచ్చాయి.

Petrol Home Delivery